ETV Bharat / business

సిటీలో మంచి ప్రాపర్టీ కొనాలని అనుకుంటున్నారా? ఈ లీగల్ డాక్యుమెంట్స్‌ మస్ట్‌! - LEGAL DOCUMENTS TO BUY PROPERTY

మీరు మంచి ప్లాట్ లేదా ఫ్లాట్‌ కొనాలని అనుకుంటున్నారా? ఈ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాల్సిందే!

Real Estate
Real Estate (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2024, 11:18 AM IST

Legal Documents To Buy Property In India : మీరు మంచి ప్లాట్ లేదా ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారా? భవిష్యత్‌లో ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు రాకూడదని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. భారతదేశంలో నేడు రియల్ ఎస్టేట్ రంగంలో విపరీతమైన న్యాయ పరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వాటిలో చిక్కుకుంటే, బయటపడడం అంత సులువు కాదు. అందుకే ప్రాపర్టీ కొనేముందు అన్ని డాక్యుమెంట్లను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అందుకే ఆ లీగల్ డాక్యుమెంట్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  1. సేల్‌ డీడ్‌ : మనం స్థలం, పొలం, ఇల్లు - ఏది కొన్నా సరే కచ్చితంగా సేల్‌ డీడ్ రాయించుకోవాల్సిందే. దీనిని సబ్‌-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సిందే. అప్పుడే మీకు సదరు ఆస్తిపై నిజమైన యాజమాన్య హక్కులు లభిస్తాయి.
  2. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ : కొన్నిసార్లు అసలైన ఓనర్లు అందుబాటులో ఉండరు. వారి తరఫున మరొకరు ప్రాపర్టీని అమ్ముతుంటారు. ఇలాంటప్పుడు కచ్చితంగా వాళ్ల పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉందో, లేదో చూసుకోవాలి. మీరు కనుక హోమ్ లోన్ కోసం వెళితే, ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
  3. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) : హౌసింగ్ ప్రాజెక్ట్‌ల విషయంలో డెవలపర్లు కచ్చితంగా వివిధ అథారిటీల నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' పొందాల్సి ఉంటుంది. కనుక మీరు ఎవరైనా బిల్డర్ లేదా డెవలపర్‌ నుంచి ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనుగోలు చేసే ముందు కచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. లేకుంటే తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
  4. సేల్ అగ్రిమెంట్ : మీరు ప్రాపర్టీ కొనేముందు కచ్చితంగా సేల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. ఇందులో మీ పేమెంట్ ప్లాన్‌, ఆస్తి బదలాయింపు సమయం సహా ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు ఉండేలై చూసుకోవాలి. మీరు కనుక డెవలపర్‌ వద్ద ప్రాపర్టీ కొనుగోలు చేస్తూ ఉంటే, నిర్మాణం ఎంత కాలంలోపు పూర్తి చేస్తారు, కామన్ ఏరియా వివరాలు, కల్పించే సౌకర్యాలు, సాధారణ నియమ, నిబంధనలు అన్నీ సదరు అగ్రిమెంట్‌లో ఉండేలా చూసుకోవాలి.
  5. అలాట్మెంట్‌ లెటర్‌ : డెవలపర్‌ లేదా హౌసింగ్ బోర్డ్‌ అనేది బయ్యర్లకు అలాట్మెంట్‌ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రాపర్టీ వివరాలు, బయ్యర్‌ చెల్లించిన డబ్బుల వివరాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమిటంటే, సేల్ అగ్రిమెంట్ వేరు, అలాట్మెంట్ లేటర్ వేరు. సేల్ అగ్రిమెంట్‌ను స్టాంప్ పేపర్‌ మీద రాస్తారు. అలాట్మెంట్ లెటర్‌ అనేది సదరు అథారిటీ లెటర్‌హెడ్‌తో ఇస్తారు.
  6. పొజెషన్ లెటర్‌ (Possession Letter) : ఇండియాలో ప్రాపర్టీ కొనేటప్పుడు కచ్చితంగా డెవలపర్‌ నుంచి ఈ పొజెషన్ లెటర్‌ తీసుకోవాల్సిందే. దీనిలో డెవలపర్‌ మీ ఫ్లాట్‌ ప్రాపర్టీ)ని ఏ తేదీలోపు మీకు స్వాధీనం చేస్తారో వివరంగా రాసి ఉంటుంది. మీరు కనుక బ్యాంక్ లోన్ కోసం వెళ్లాలనుకుంటే, ఈ పొజెషన్ లెటర్‌ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
  7. ఖాతా సర్టిఫికెట్ (Khata Certificate) : దీనిని extracts అని కూడా అంటారు. ఆయా రాష్ట్రాలను బట్టి దీని పేరు మారుతుంది. ఈ ఖాతా సర్టిఫికెట్‌ అనేది ఆస్తి యాజమాన్యం, చట్టపరమైన స్థితి ధ్రువీకరించే ఒక చట్టపరమైన పత్రం. మీరు భవిష్యత్‌లో సదరు ప్రాపర్టీని అమ్మాలనుకుంటే ఈ ఖాతా సర్టిఫికెట్‌ను కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
  8. మ్యుటేషన్ రిజిస్టర్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ : మీరు కనుక గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ఉన్న ప్రాపర్టీని కొనాలని అనుకుంటే, కచ్చితంగా మ్యుటేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల సదరు ఆస్తిపై పూర్వం ఎవరికి యాజమాన్య హక్కులు ఉండేవి అనేది తెలుస్తుంది. భవిష్యత్‌లో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
  9. బిల్డింగ్ ప్లాన్ కాపీ : మీరు కనుక ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు అయితే, సంబంధిత అథారిటీ నుంచి ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్‌ కాపీని కచ్చితంగా తీసుకోవాలి. దీని వల్ల సదరు బిల్డింగ్‌ను ప్లాన్‌ ప్రకారం సరిగ్గా కట్టారా, లేదా అనేది తెలుస్తుంది. ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి వీలవుతుంది.
  10. పేమెంట్ రిసిప్ట్స్‌ : ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు చేసిన పేమెంట్స్‌కు సంబంధించి ఒరిజినల్ రిసిప్ట్స్‌ను కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు వీటన్నింటీనీ మీరు సమర్పించాల్సి ఉంటుంది.
  11. ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్‌ : భారతదేశంలో రియల్ ఎస్టేట్ ఆస్తులపై కచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిందే. కనుక మీరు ప్రాపర్టీ కొనేముందు, అమ్మేవ్యక్తి సదరు ఆస్తికి సంబంధించి అన్ని ట్యాక్స్‌లు ప్రభుత్వానికి చెల్లించాడా, లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ అన్ని పన్నులు చెల్లించి ఉంటే, ఆ రిసిప్ట్‌ కాపీలను మీరు తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
  12. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌ : దీనినే సింపుల్‌గా EC అని కూడా అంటారు. ఇది సదరు ప్రాపర్టీ నిజమైన యజమాన్యాన్ని తెలుపుతుంది. అంతేకాదు సదరు ఆస్తి తనఖాలో ఉందా, లేదా; ఏవైనా కట్టాల్సిన బకాయిలు ఉన్నాయా, లేదా అనేది తెలుపుతుంది.
  13. కంప్లీషన్ సర్టిఫికెట్‌ : దీనిని సింపుల్‌గా CC అని అంటారు. నిర్మాణం అనుకున్న ప్లాన్ ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా జరిగిందా, లేదా అనేది దీని ద్వారా తెలుస్తుంది. నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, అన్ని పత్రాలను క్షుణ్ణంగా సమీక్షించి లోకల్ డెవలప్‌మెంట్ అథారిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ఈ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది.
  14. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ : దీనిని సింపుల్‌గా OC అని అంటారు. భవనాన్ని ప్లాన్ ప్రకారం నిర్మించారని, అది నివసించడానికి అనువుగా, సురక్షితంగా ఉందని నిర్ధరణ చేస్తూ స్థానిక ప్రభుత్వ ఏజెన్సీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా స్థానిక డెవలప్‌మెంట్ ఏజెనీ ఈ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది.
  15. ల్యాండ్‌ కన్వర్షన్ సర్టిఫికెట్ : వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వినియోగించాలంటే కచ్చితంగా ల్యాండ్‌ కన్వర్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సదరు వ్యవసాయ భూమి, కమర్షియల్ ల్యాండ్ అవుతుంది. దానిలో నిర్మాణాలు చేపట్టడానికి వీలవుతుంది.

హైదరాబాద్​లో ఇల్లు లేదా స్థలం కొనాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​!

ఇల్లు/ఫ్లాట్ కొంటున్నారా? - ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.