ETV Bharat / health

డెలివరీ తర్వాత పొట్ట తగ్గట్లేదా? ఈ సింపుల్ టిప్స్​తో ఈజీగా పోతుందట! - REDUCE BELLY FAT AFTER PREGNANCY

-ప్రసవం అనంతరం పొట్ట తగ్గేందుకు ఈ చిట్కాలు పాటించాలట! -డైటింగ్ పాటించడం బిడ్డ ఆరోగ్యనికి మంచిది కాదంటున్న నిపుణులు

Reduce Belly Fat After Pregnancy
Reduce Belly Fat After Pregnancy (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 16, 2024, 2:12 PM IST

Reduce Belly Fat After Pregnancy: ప్రసవం అనంతరం చాలా మంది మహిళల్లో పొట్ట కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా కొంతమంది మహిళలు అసౌకర్యంగా భావిస్తుంటారు. వాస్తవానికి కడుపుతో ఉన్నప్పుడు బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట పెరుగుతూ వస్తుందట. అయితే ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి వస్తుందని.. కానీ కొందరిలో ఇలా సాధారణ స్థితికి రాక ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సహజ పద్ధతుల ద్వారా పొట్టను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, ఇంకెందుకు ఆలస్యం.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సహజ చిట్కాలతో!
ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చటి నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనికి ఒక చెంచా నిమ్మరసం, అరచెంచా తేనె కూడా కలిపి తాగితే కొద్ది రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. Journal of Alternative and Complementary Medicineలోని ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. The Effects of Honey on Weight Loss in Overweight and Obese Individuals: A Systematic Review and Meta-Analysis అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో Iran University of Medical Sciences ప్రొఫెసర్ Zahra Yaghoobi పాల్గొన్నారు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని భోజనానికి ముందు కూడా తాగవచ్చని సూచిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

  • నీటిలో రెండు మూడు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పది నిమిషాల పాటు మరిగించాలట. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని వరుసగా 40 రోజుల పాటు తాగడం వల్ల పొట్ట తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇంకా రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం కూడా మంచిదేనని చెబుతున్నారు.
  • ప్రసవానంతరం పొట్ట తగ్గించుకోవడానికి యాపిల్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అదనపు కొవ్వుల్ని శరీరం గ్రహించకుండా చేయడంతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేస్తుందని అంటున్నారు. ఫలితంగా పొట్ట తగ్గి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. అలాగే ఆయా సీజన్లలో లభించే తాజా పండ్లు, కాయగూరల్ని సైతం ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • ఇంకా పిల్లలకు డబ్బా పాలు కాకుండా తల్లి పాలు పట్టడం వల్ల కూడా పొట్ట తగ్గే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. బిడ్డకు ప్రతిరోజూ తల్లి పాలివ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో క్యాలరీలు ఖర్చవుతాయని.. ఫలితంగా కొవ్వులు కరిగిపోతాయని అంటున్నారు.
  • ముఖ్యంగా పూర్తిగా డైటింగ్ చేయడం లేదా ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటించకపోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభావం పాలు తాగి పెరిగే బిడ్డ పైన కూడా పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి డాక్టర్ సలహా మేరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిర్ణయించుకోవాలని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చలికాలంలో షుగర్ పేషెంట్లు జాగ్రత్త! ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవట!

కండల కోసం జిమ్​లో ఇచ్చే ప్రోటీన్ పౌడర్లు వాడుతున్నారా? సిక్స్ ప్యాక్ ఏమో కానీ ఆస్పత్రి పాలవడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.