ETV Bharat / state

సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు - సీటు వస్తే డిఫెన్స్‌లో జాబ్ పక్కా - ENTRANCE IN SAINIK SCHOOL 2025

సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు - ఆరు, తొమ్మిది తరగతులకు ప్రవేశం - 2025 జనవరిలో పరీక్ష

6th And 9th Class Entrance Sainik Schools
6th And 9th Class Entrance Sainik Schools (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

6th And 9th Class Entrance Sainik Schools : దేశభక్తిని చాటుకోవాలనే విద్యార్థులకు సైనిక్‌ పాఠశాలలు చక్కని అవకాశం కల్పిస్తున్నాయి. ఇటువంటి ఆలోచనలు ఉన్నవారికి ఇదే సువర్ణావకాశం. సైనిక్‌ పాఠశాలల్లో 2025-26 సంవత్సరానికి6, 9వ తరగతుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశ రక్షణలో భాగంగా త్రివిధ దళాలకు అవసరమైన సైనిక అధికారులను తయారు చేయాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా ఈ స్కూళ్లను ప్రారంభించారు. ఈ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి బాలబాలికలు, 9వ తరగతుల్లో ప్రవేశం పొందడానికి బాలురు మాత్రమే అర్హులు. ఇందులో సీటు పొందాలి అనుకుంటే సైనిక పాఠశాల నిర్వహించే ప్రవేశ పరీక్ష, వైద్య పరీక్షలో క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ ఇంటర్మీడియట్‌ వరకు చదువుకోవచ్చు.

ఈ పాఠశాలల్లో రిజర్వేషన్‌ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఎస్టీలకు 7.5 శాతం, ఎస్సీలకు 15శాతం, రక్షణలో శాఖలో పని చేస్తున్నవారు, మాజీ సైనిక ఉద్యోగులకు పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. 6వ తరగతిలో 80 సీట్లు, 9వ తరగతిలో 20 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేస్తారు.

రక్షణ శాఖ నుంచి ఆర్థిక సహాయం : 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్య, వసతితో పాటు, ఎన్‌సీసీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, గుర్రపు స్వారీ, యోగా, చిత్రలేఖనం, సంగీతం, ఈత సహా పాఠ్య కార్రక్రమాల్లో శిక్షణ ఇస్తారు. మొదటి సంవత్సరం రూ.1.10 లక్షల ఫీజుగా చెల్లించాలి. విద్యలో ఉత్తన ప్రతిభ కనబర్చినవారికి రక్షణ శాఖ నుంచి 50శాతం అంటే రూ.53వేల చొప్పున ఉపకార వేతనం అందుతుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం పొందొచ్చు. సైనిక్‌ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థులకు నేషనల్‌ డిఫెన్స్ అకాడమీ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పుణేలో రెండేళ్లు శిక్షణ ఇస్తారు. ప్రతిక్ష ఆధారంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో అధికారులుగా నియమిస్తారు.

ఈ విద్యాలయం - సైనికులను తయారు చేసే కర్మాగారం - Sainik School In Warangal

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్ష పూర్తిగా రాత విధానంలో ఉంటుంది. 6వ తరగతి ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు రెండున్నర గంటలు, 9వ తరగతి విద్యార్థులకు 3 గంటల సమయం ఉంటుంది. ఆరో తరగతి పరీక్ష గుర్తింపు పొందిన అన్ని ప్రాంతీయ భాషల్లో, 9వ తరగతికి ఆంగ్లంలో ఉంటుంది

6వ తరగతి పరీక్ష : 300 మార్కుల పరీక్ష ఉంటుంది. గణితం 150 మార్కులకు, జనరల్‌ నాలెడ్జ్‌ 50 మార్కులకు, భాషా సామార్థ్యం 50 మార్కులకు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీసం 25 శాతం మార్కులు కచ్చతింగా సాధించాలి. అన్ని సబ్జెక్టులు కలిపి 40శాతం మార్కులు రావాలి.

తొమ్మిదో తరగతి : 400 మార్కులకు పేపర్ ఉంటుంది. దీనిలో గణితం 200 మార్కులు, సామాన్యశాస్త్రం 50 మార్కులు, ఆంగ్లంలో 50 మార్కులకు, సాంఘికశాస్త్రం 50, ఇంటెలిజెన్స్‌ 50 మార్కులకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 180 నిమిషాలు. అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీసం 25శాతం మార్కులు కచ్చితంగా సాధించాలి. అన్ని సబ్జెక్టులు కలిపి 40 శాతం మార్కులు వస్తేనే అర్హత సాధిస్తారు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 1:3 నిష్పత్తిలో వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు.

6వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. (1 ఏప్రిల్‌ 2012 నుంచి 31 మార్చి 2015) మధ్య జన్మించిన వారు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతుండాలి. 9వ తరగతిలో 13 నుంచి 15 ఏళ్ల వయస్సు కలిగి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతుండాలి. (01 ఏప్రిల్‌ 2010 నుంచి 31 మార్చి 2012)మధ్య జన్మించి ఉండాలి.

2025 జనవరి 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. www.aissee.nta,nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి ఫొటో, సంతకం, ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.500, జనరల్‌, డిఫెన్స్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.650 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. తుది గడువు డిసెంబర్‌ 20. రిజిస్టర్‌ చేసుకున్న సెల్‌ఫోన్‌ నంబరు సంక్షిప్త సందేశాన్ని పంపిస్తారు. ఆన్‌లైన్‌లో పంపిన విద్యార్థులు దరఖాస్తును ఫ్రింట్‌ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి.

విద్యార్థుల దగ్గర ఉండాల్సిన ధ్రువపత్రాలు జనన, కుల, నివాస, ధ్రువపత్రాలతో పాటు సైనిక ఉద్యోగుల పిల్లలకు సర్వీసు సర్టిఫికెట్‌, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు పీపీఓను అప్‌లోడ్‌ చేయాలి.

ఆంధ్రప్రదేశ్‌: విజయనగరంల, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్‌

NCC Cadets From Telangana at All India Thal Sainik Camp : జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల ఎన్​న్​సీసీ విద్యార్థులు..

నేషనల్​ డిఫెన్స్​ అకాడమీలో 198 గ్రూప్​-సీ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.