ETV Bharat / state

ప్రశ్నాపత్రాల లీక్ వంటివి లేకుండా ఖాళీల భర్తీ చేస్తున్నాం : భట్టి విక్రమార్క - DEPUTY CM BHATTI VIKRAMARKA

నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది స్థిరపడాలనేదే తమ లక్ష్యమన్న భట్టి - టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని వెల్లడి

TG ASSEMBLY SESSIONS
DEPUTY CM BHATTI VIKRAMARKA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2024, 3:16 PM IST

Deputy CM Bhatti Vikramarka : తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంలోనే 55,172 ఉద్యోగాలు భర్తీ చేశామని ఇందులో 54,573 మందికి నియామక పత్రాలు జారీ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. ఉద్యోగాల భర్తీపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు. గత పది సంవత్సరాల పాటు ఉద్యోగ నియామకాలు లేక యువత అల్లాడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం యువత ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నట్లు గుర్తు చేశారు.

గత పాలకులపై అసహనం : ఈ ప్రభుత్వం తెచ్చుకున్నదే యువత అని, నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది సమయంలోనే 55 నుంచి 56 వేల ఉద్యోగాలు భర్తీ చేసినందుకు గర్వంగా ఉందని తెలిపారు. గత పాలకులు పదేళ్ల కాలంలో గ్రూప్-1 పరీక్షను ఒక్కసారి కూడా నిర్వహించలేకపోయారని, కనీసం ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే పాత ఖాళీలు, మరికొన్ని కలిపి కొత్తగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.

"ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలను ఆపాలని కావాలనే కొంత మంది కోర్టుకు వెళ్లారు, కానీ తాము ఇచ్చిన మాట ప్రకారం 563 పోస్టులకు పరీక్ష నిర్వహించాం. 11,062 ఖాళీలతో డీఎస్సీ నిర్వహించి 10,600 మందికి అపాయింట్​మెంట్​ ఆర్డర్లు ఇచ్చాం. ఉద్యోగ నియామక పరీక్షలన్నీ పారదర్శకంగా, ప్రశ్నాపత్రం లీక్ వంటివి లేకుండా చూసుకుంటూ ఖాళీలను భర్తీ చేసుకుంటూ పోతున్నాం"- భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

ఖాళీగా ఉన్న ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం దశలవారీగా భర్తీ చేసుకుంటూ ముందుకు వెళుతున్నట్టు భట్టి చెప్పారు. ఉర్దూ మీడియంలో బ్యాక్​లాగ్​ పోస్టుల భర్తీకి రిజర్వేషన్ విధానం పరిశీలించాలని కొందరు సభ్యులు అడిగిన విషయంపై స్పందించిన ఆయన అలా అవకాశం లేదని స్పష్టం చేశారు.

సీఎంతో పాటు అందరం నెలలో ఒకరోజు హాస్టళ్లలో పర్యటిస్తాం : భట్టి విక్రమార్క

త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తాం : భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.