ETV Bharat / business

'స్కోడా కైలాక్‌' క్రేజ్ చూశారా?- 10రోజులకే 10వేల బుకింగ్స్.. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోందిగా..! - SKODA KALYK PRODUCTION STARTED

అబ్బబ్బా ఏమి డిమాండ్- బుకింగ్స్​లో టాప్​ గేర్​లో దూసుకుపోతున్న 'స్కోడా కైలాక్'- ప్రొడక్షన్​పై కంపెనీ ఫోకస్

Skoda Kylaq
Skoda Kylaq (Skoda Auto India)
author img

By ETV Bharat Tech Team

Published : 3 hours ago

Updated : 3 hours ago

Skoda Kalyk Production Started: స్కోడా ఆటో ఇండియా ఇటీవలే ఇండియాలో తన మొట్ట మొదటి కాంపాక్ట్ SUV 'స్కోడా కైలాక్‌'ను లాంఛ్ చేసింది. కంపెనీ దీన్ని రూ. 7.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ కారును అధునాతన ఫీచర్లతో సరసమైన ధరలోనే తీసుకురావడంతో రికార్డ్ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ కైలాక్ బుకింగ్స్​ ప్రారంభించిన 10రోజులకే 10,000 బుకింగ్​లను​ అందుకుందని సమాచారం. దీంతో కంపెనీ దీని ప్రొడక్షన్​పై ఫోకస్ చేసింది.

స్కోడా ఆటో ఇండియా.. పూణేలోని చకన్‌లోని తన ఫ్యాక్టరీలో కొత్త స్కోడా కైలాక్ సబ్-ఫోర్-మీటర్ SUV ప్రొడక్షన్​ను స్టార్ట్ చేసింది. ఈ కారును కంపెనీ MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇదే ప్లాట్​ఫామ్​పై స్కోడా కుషాక్, స్లావియా కూడా రూపొందించారు. 'స్కోడా కైలాక్' SUV బుకింగ్స్​ డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అయితే వీటి డెలివరీలు మాత్రం జనవరి 27, 2025 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

దీనికి ముందు కంపెనీ డిసెంబర్​ 13 నుంచి ఈ SUVతో 'ఇండియా డ్రీమ్ టూర్'ను ప్రారంభించనుంది. ఈ టూర్​లో భాగంగా స్కోడా కైలాక్ మూడు యూనిట్లు దేశవ్యాప్తంగా ప్రయాణించి జనవరి 25న చకన్ ప్లాంట్‌కి తిరిగి రానున్నాయి. ఈ పర్యటనలో ఈ కార్లు పుణె, ముంబయి, కొల్హాపూర్, అహ్మదాబాద్, సూరత్, ఉదయపూర్, భోపాల్, కోయంబత్తూర్, కొచ్చి, దిల్లీ, రాంచీ, త్రివేండ్రం, చండీగఢ్, కోల్‌కతా, చెన్నై, జమ్ము, మండి, ఆగ్రా, గౌహతితో పాటు అనేక ఇతర నగరాల్లో పర్యటించనున్నాయి.

ఈ పర్యటన ద్వారా కస్టమర్‌లు జనవరి 27, 2025న ప్రారంభమయ్యే డెలివరీలకు ముందు కొత్త స్కోడా కైలాక్‌ను వ్యక్తిగతంగా చూడగలరు. అంతేకాక ఈ కారును 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో కూడా ప్రదర్శించనున్నారు. కంపెనీ ఈ కొత్త స్కోడా కైలాక్ కోసం బుకింగ్‌లను అంగీకరిస్తూనే ఉంది. అయితే ఎంట్రీ-లెవల్ క్లాసిక్ వేరియంట్ బుకింగ్ ప్రాసెస్​ను మాత్రం నిలిపివేసింది.

ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్, మెషిన్డ్ అల్లాయ్ వీల్స్, సిక్స్-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. దీని ఫీచర్లపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6000mAh బ్యాటరీ ప్యాక్​తో 5G ​ఫోన్- నీటిలో పడినా ఏం కాదంట.. ధర కూడా రూ.15వేల లోపే!

మెర్సిడెస్​ నుంచి లగ్జరీ 5-సీటర్ బెంజ్ - దేశంలోనే ఏ EVకి లేనంత అతిపెద్ద సెల్ కెపాసిటీతో..!

గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్- ఇది అలాంటిలాంటిది కాదుగా.. అంచనాలకు మించి!

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.