Prabhas Injured : పాన్ఇండియా స్టార్ ప్రభాస్ స్వల్పంగా గాయపడ్డారు. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండగా ఆయన కాలు బెణికింది. చికిత్స చేపట్టిన వైద్యులు ప్రభాస్‌కు విశ్రాంతి సూచించారు. తమ అభిమాన హీరోకు గాయం అవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
అయితే జపాన్‌లో 'కల్కి' సినిమా 2025 జనవరి 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రభాస్‌తో అక్కడ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. కానీ, తాజా గాయం కారణంగా ఆయన జపాన్‌లో 'కల్కి' సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లడం కష్టమని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.