Zomato Increased Platform Fee: నచ్చిన ఫుడ్ నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుండడంతో.. అందరూ ఆన్లైన్లో స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టేస్తున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంది. అయితే.. డిమాండ్‌కు తగ్గట్లుగానే ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెంచేస్తున్నాయి ఆయా సంస్థలు. ఇప్పటికే.. డెలివరీ ఛార్జీలు, జీఎస్టీ వంటివి భారంగా ఉండగా.. కొంత కాలం కిందట ప్రవేశపెట్టిన ప్లాట్‌ఫాం ఫీజు దీనికి అదనం. దీంతో ఫుడ్ డెలివరీ మరింత ప్రియంగా మారింది. తాజాగా ప్లాట్‌ఫామ్ ఫీజును మరింతగా పెంచుతూ జొమాటో నిర్ణయం తీసుకుంది.
25 శాతం పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజ్:జొమాటో కంపెనీ తన ప్లాట్‌ఫామ్ ఫీజును 25 శాతం పెంచి ఒక్కో ఆర్డర్‌పై వసూలు చేసే ఛార్జీని 5 రూపాయలకు చేర్చింది. తొలిసారిగా జొమాటో.. తన ప్లాట్‌ఫామ్ ఫీజను 2023 ఆగస్టులో 2 రూపాయలు వసూలు చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్లాట్‌ఫామ్ ఫీజును 3 రూపాయలకు పెంచిన కంపెనీ.. ఈ ఏడాది జనవరిలో దానిని 4 రూపాయలుగా మార్చింది. ఇప్పుడు 5 రూపాయలుగా నిర్ణయించింది. ఇప్పటి నుంచి జొమాటోలో పెట్టే ప్రతి ఆర్డర్‌పై కస్టమర్లు రూ.5 చొప్పున చెల్లించాలి. పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజుల కారణంగా డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ కూడా పెరుగుతుంది. ఇక కొత్త ప్లాట్‌ఫారమ్ ఫీజు జొమాటో గోల్డ్ సహా వినియోగదారులందరికీ వర్తించనుంది.
జొమాటో న్యూ సర్వీస్ - ఇకపై ఒకేసారి 50 మందికి సరిపడా ఫుడ్ డెలివరీ! - Zomato Large Order Fleet