Fixed Deposit Vs Recurring Deposit :మన భవిష్యత్ బాగుండాలంటే, వచ్చిన ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మన ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి. అత్యవసర సమయంలో ఆ పొదుపు చేసిన డబ్బులు మనల్ని ఆదుకుంటాయి. పొదుపు పథకాలు అనగానే మనకు ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ ఆర్థిక లక్ష్యాలు, నష్టాన్ని భరించే శక్తి, డబ్బు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
Fixed Deposit (ఎఫ్డీ) :
- ఫిక్స్‌డ్ డిపాజిట్లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
- ఎఫ్‌డీల్లో ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లు ఉంటాయి. వీటిలో ఎలాంటి మార్పులు ఉండవు.
- మీరు కొరుకున్న టెన్యూర్‌కు ఎఫ్డీ చేసుకోవచ్చు. అంటే కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల వ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవచ్చు.
- ఎఫ్డీ పేఅవుట్ ప్రిఫరెన్స్‌ను మీకు నచ్చినట్లుగా ఎంచుకోవచ్చు. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని మీ అవసరాల కోసం తీసుకోవచ్చు. లేదా ఆ వడ్డీని మళ్లీ రీఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా కాంపౌండింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్లలో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అంటే మీరు ఎఫ్‌డీల నుంచి మధ్యలో డబ్బులు తీయలేరు. ఒకవేళ తీయాల్సి వస్తే, మీకు రావాల్సిన వడ్డీని వదులుకోవాల్సి వస్తుంది. పైగా పెనాల్టీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Recurring Deposit (ఆర్డీ) :
- రికరింగ్ డిపాజిట్లలో మీరు రెగ్యులర్‌గా (నెలవారీగా) డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.
- రికరింగ్ డిపాజిట్లో మీకు నచ్చినంత డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్ లాగానే, రికరింగ్ డిపాజిట్లో కూడా ఫిక్స్‌డ్ వడ్డీ రేటు ఉంటుంది.
- ఆర్డీ కూడా నిర్ణీత కాలవ్యవధి (ఫిక్స్‌డ్ టెన్యూర్) తరువాత మెచ్యూర్ అవుతుంది. కనుక మీకు ఎంత రాబడి వస్తుందో ముందే తెలిసిపోతుంది.
- ఎఫ్‌డీతో పోలిస్తే ఆర్డీలో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు అవసరమైనప్పుడు రికరింగ్ డిపాజిట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అవసరమైతే ఆర్డీపై లోన్ కూడా తీసుకోవచ్చు.