తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలా? ఎక్కువ వడ్డీ ఇచ్చే టాప్‌-7 బ్యాంక్స్ ఇవే!

3 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై - ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్లు ఇవే!

By ETV Bharat Telugu Team

Published : 11 hours ago

Fixed Deposits
Fixed Deposits (ETV Bharat)

FD Interest Rates 2024 : మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పడదామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. త్వరలో బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఎక్కువ వడ్డీ రేటు అందిస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.

కారణమిదే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా గత 10 'ద్రవ్య పరపతి విధాన సమీక్ష' (ఎంపీసీ)ల్లో రెపో రేటును స్థిరంగా ఉంచుతూ వచ్చింది. కానీ డిసెంబర్‌లో జరగనున్న ఎంపీసీలో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. అప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారికి ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే వీలైనంత త్వరగా ఎక్కువ వడ్డీ రేటు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఏది బెస్ట్ ఛాయిస్‌!
ఒక ఏడాది కాలవ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. 5 ఏళ్ల కాలపరిమితి గల ఎఫ్‌డీలు తీసుకుంటే, వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ మధ్యలో మీకు ఆర్థిక అత్యవసరం ఏర్పడితే, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ వడ్డీ రేటు ఉండి, స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా 3 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ప్రైవేట్ బ్యాంకులు - వడ్డీ రేట్లు
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బ్యాంక్‌ జనరల్ సిటిజన్స్‌ సీనియర్ సిటిజన్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 7% 7.5%
ఐసీఐసీఐ బ్యాంక్‌ 7% 7.5%
కోటక్ మహీంద్రా బ్యాంక్‌ 7% 7.6%
ఫెడరల్ బ్యాంక్ 7% 7.5%
  • దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ - ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.5% చొప్పున వడ్డీ అందిస్తోంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.5% చొప్పున వడ్డీ ఇస్తోంది.
  • కోటక్ మహీంద్రా బ్యాంక్‌ ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.6% చొప్పున వడ్డీ అందిస్తోంది.
  • ఫెడరల్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.5% చొప్పున వడ్డీ ఇస్తోంది.

ప్రభుత్వ బ్యాంకులు - వడ్డీ రేట్లు

బ్యాంక్‌ జనరల్ సిటిజన్స్‌ సీనియర్ సిటిజన్స్‌
ఎస్‌బీఐ 6.75% 7.25%
పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ 7% 7.5%
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.7% 7.2%
  • దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 6.75%, సీనియర్ సిటిజన్లకు 7.25% చొప్పున వడ్డీ ఇస్తోంది.
  • పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.5% చొప్పున వడ్డీ అందిస్తోంది.
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 6.7%, సీనియర్ సిటిజన్లకు 7.2% చొప్పున వడ్డీ ఇస్తోంది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఎంత ఇన్వెస్ట్ చేయాలి?
మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బులో కొంత మొత్తాన్ని మాత్రమే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టాలి. మిగతా డబ్బును ఇతర పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే రాబడి, మిగతా వాటితో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఈ ఎఫ్‌డీలపై వచ్చిన రాబడిపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో దీర్ఘకాలంపాటు ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ రాబడి ఉండకపోవచ్చు. పైగా ద్రవ్యోల్బణం రేటు కన్నా, ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ రేటు తక్కువగా ఉంటే, మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

మీ పిల్లల పేరుతో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - fixed deposit for children

ఫిక్స్‌డ్ డిపాజిట్ Vs రికరింగ్ డిపాజిట్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్​! - Fixed Deposit Vs Recurring Deposit

ABOUT THE AUTHOR

...view details