తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్ - ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్​ - వాటిని రీప్లేస్​ చేయాల్సిందే! - FASTag New Rules From August 1st

FASTag New Rules From August 1 : వాహనదారులూ బీ అలర్ట్. ఆగస్టు 1 వస్తోంది. ఫాస్టాగ్​ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. మీ వాహనం ఫాస్టాగ్​ మూడేళ్లలోపుదైతే వెంటనే కేవైసీ అప్‌డేట్ చేయించుకోండి. ఐదేళ్ల కిందటిదైతే రీప్లేస్ చేయించుకోండి. కొత్త రూల్స్‌పై పూర్తి వివరాలివీ.

FASTag rules change from august 1st 2024
FASTag Latest News (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 2:43 PM IST

FASTag New Rules From August 1 :ఫాస్టాగ్​ కొత్త రూల్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ఇబ్బంది కలగకూడదంటే మనం తప్పకుండా ఫాస్టాగ్​ ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ)ని అప్‌డేట్ చేయించుకోవాలి. గత మూడేళ్లలో తీసుకున్న ప్రతీ ఫాస్టాగ్​కు కేవైసీ తప్పనిసరి. ఐదేళ్ల కంటే పాత ఫాస్టాగ్​లను రీప్లేస్ చేయించుకోవాలి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) జారీ చేసిన మార్గదర్శకాలను ఫాలో అయితే జాతీయ రహదారులపై రాకపోకల సందర్భంగా ఎలాంటి అవాంతరమూ కలగదు.

కొత్త రూల్స్ ఇవే!

  • కేవలం వాహనదారులే కాదు, వారికి ఫాస్టాగ్​లు జారీ చేసిన కంపెనీలు కూడా ఆగస్టు 1 నుంచి అలర్ట్ కావాలి. మూడేళ్లలోపు ఫాస్టాగ్​ల కేవైసీని అప్‌డేట్ చేయాలి.
  • ఐదేళ్ల కిందటి ఫాస్టాగ్​లను రీప్లేస్ చేయాలి. అక్టోబరు 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనివల్ల ఆయా ఫాస్టాగ్​ హోల్డర్లకు టోల్ ప్లాజాల వద్ద నిరంతరాయ సేవలు అందుతాయి.
  • ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్​లన్నీ తప్పకుండా వాహన రిజిస్ట్రేషన్ నంబరు, ఛాసిస్ నంబర్​తో లింక్ అయి ఉండాలి.
  • కొత్తగా వాహనాలు కొనే వారు తమ వాహన రిజిస్ట్రేషన్ నంబరును మొదటి 90 రోజుల్లోగా అప్‌డేట్ చేయించుకోవాలి. ఈ వివరాలను ఫాస్టాగ్​జారీ చేసే కంపెనీలు వేగవంతంగా వేరిఫై చేసి, డాటాబేస్‌లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు మార్చాలి.
  • ఫాస్టాగ్​ జారీ చేసే కంపెనీలకు వాహనదారులు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడి సమాచారాన్ని అందించాలి. వాహనం ముందు భాగం, వెనుక భాగానికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలను ఫాస్టాగ్​ సర్వీస్ ప్రొవైడర్‌కు అందించాలి. తద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని గుర్తించడం ఈజీ అవుతుంది.
  • ప్రతీ ఫాస్టాగ్ ఒక ఫోన్ నంబరుతో కనెక్ట్ అయి ఉంటుంది. దానికే మెసేజ్‌లు, అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు వెళ్తాయి.
  • అక్టోబరు 31దాకా టైం ఉంది కదా అని వాహనదారులు ఎదురుచూడటం సరికాదు. సాధ్యమైనంత త్వరితగతిన కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం చాలా బెటర్.

2019 నుంచి టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులను సులభతరం చేయడం కోసం, ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి తీసుకొచ్చిన తనిఖీ వ్యవస్థే ఫాస్టాగ్​. ఈ వ్యవస్థను 2019 సంవత్సరంలో కేంద్ర రవాణాశాఖ ప్రారంభించింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) నిర్వహిస్తుంది. ఫాస్టాగ్ వ్యవస్థ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది.

ఐటీఆర్​ దాఖలు​ చేశారా? ఇదే లాస్ట్​ డేట్​ - గడువు దాటితే ఆ ప్రయోజనాలు కట్​! - ITR Filing Last Date 2024

హోం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఏజెంటును కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలివే! - Home Insurance Questions

ABOUT THE AUTHOR

...view details