Bike For Business Purpose : చిరు వ్యాపారులకు టూ-వీలర్స్‌తో చాలా పని ఉంటుంది. ముఖ్యంగా తమ వ్యాపారానికి అవసరమైన సరకులను, వస్తువులను సులువుగా రవాణా చేయడానికి ఇవి అవసరం అవుతాయి. అందుకే తక్కువ ధరలో, మంచి మైలేజ్ ఇచ్చే టూ-వీలర్ కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇలాంటి వారిని టార్కెట్ చేసుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు చాలా తక్కువ ధరలో, మంచి డ్రైవింగ్ కంఫర్ట్ ఉండే బైక్స్‌ను మార్కెట్లోకి విడుదల చేశాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. Kinetic Green E-Luna : భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన ద్విచక్ర వాహనాల్లో కెనటిక్ లూనా ఒకటి. తక్కువ బరువుతో, మంచి మైలేజ్‌తో ఇది వస్తుంది. వస్తువులను రవాణా చేయడానికి కూడా ఇది ఎంతో బాగుంటుంది. అందుకే ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా మార్కెట్లోకి తెచ్చింది. అదే కెనటిక్ గ్రీన్ ఈ-లూనా.
కెనటిక్ గ్రీన్ ఈ-లూనా కేవలం 3-4 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. గంటకు 52 కి.మీ వేగంతో వెళుతుంది. దీని రేంజ్ 90 కి.మీ. కనుక చిరువ్యాపారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కెనటిక్ గ్రీన్ ఈ-లూనా 2 వేరియంట్లలో, 5 రంగుల్లో లభిస్తుంది.
Kinetic Green E-Luna Price :
- కెనటిక్ గ్రీన్ ఈ-లూనా X1 ధర రూ.69,990 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
- కెనటిక్ గ్రీన్ ఈ-లూనా X2 ధర రూ.79,990 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
2. TVS XL 100 Comfort :భారత మార్కెట్లో ఉన్న మరో మంచి టూ-వీలర్ 'టీవీఎస్ ఎక్స్ఎల్ 100 కంఫర్ట్'. రూ.50,000 లోపు మంచి బైక్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీఎస్ బండి బ్లూ, బ్రౌన్ కలర్లలో లభిస్తుంది. దీని బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కనుక గతుకల రోడ్లపై కూడా ఎంత లోడ్‌తో అయినా హాయిగా వెళ్లిపోవచ్చు.
TVS XL 100 Comfort Features :
- ఇంజిన్ కెపాసిటీ : 99.7 సీసీ
- మైలేజ్ : 55 కి.మీ/ లీటర్
- ట్రాన్స్మిషన్ : ఆటోమేటిక్
- కెర్బ్ వెయిట్ : 86 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 4 లీటర్లు
TVS XL 100 Comfort Price : ఈ బండిలో రెండు వేరియంట్లు ఉన్నాయి. వాటి ధరలు ఎలా ఉంటాయంటే?
- టీవీఎస్ 100 కంఫర్ట్ కిక్ స్టార్ట్ ధర రూ.46,714 (ఎక్స్-షోరూం ధర) ఉంటుంది.
- టీవీఎస్ 100 కంఫర్ట్ ఐ-టచ్ స్టార్ట్ ధర రూ.60,728 (ఎక్స్-షోరూం ధర) ఉంటుంది
3. TVS XL 100 Heavy Duty :హైవీ లోడ్స్ తీసుకెళ్లే చిరు వ్యాపారులకు ఈ టీవీఎస్ బండి చాలా అనుకూలంగా ఉంటుంది. పైగా దీని ధర చాలా తక్కువ. ఇది హెవీ డ్యూటీ బండి కనుక గతుకుల రోడ్లపై కూడా, ఎంత లోడ్నైనా చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు. కేటరింగ్, లాజిస్టిక్స్ బిజినెస్ చేసేవారికి, చిన్న చిన్న కిరాణా షాపులు నడిపేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని మెయింటైన్ చేయడం కూడా చాలా సులువు.