EPS Withdrawal Rules Changed : తరచూ ఉద్యోగాలు మారే వారికి శుభవార్త అందిస్తూ ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. తాజా నిబంధనల్లో ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులు ఈపీఎస్‌లో డిపాజిట్ చేసిన నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈపీఎస్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే కనీసం 6 నెలల సర్వీస్ ఉండాలనే రూల్ ఉండేది. తాజాగా దాన్ని సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 7 లక్షల మంది పీఎఫ్ చందాదారులకు ఊరట కలిగింది.
కొత్త రూల్ ఏంటి?
ఇప్పటి వరకు, 6 నెలల సర్వీస్ పూర్తి కాకముందే జాబ్ వదిలిపెట్టిన లేదా మారిన ఉద్యోగులు తమ ఈఫీఎఫ్కాంట్రిబ్యూషన్ను మాత్రమే విత్‌డ్రా చేసుకోగలిగేవారు. ఈపీఎస్‌లోని నగదును విత్‌డ్రా చేసుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్‌తో ఆరు నెలల సర్వీర్ పూర్తికాకపోయినా ఉద్యోగులు తమ ఈపీఎఫ్, ఈపీఎస్ కాంట్రిబ్యూషన్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ ఎంతంటే?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పథకం కింద ప్రతి ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్‌ఖాతాకు వెళ్తుంది. అంతేమొత్తాన్ని యజమాని జమ చేస్తాడు. అయితే యజమాని చెల్లించే ఈ 12 శాతం వాటాలో 8.33శాతం ఈపీఎస్‌లోకి, మిగతా 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది.