Demat Accounts In India Cross 15 Crore : దేశంలో డీమ్యాట్ ఖాతాలు 15 కోట్లు దాటి, కొత్త మైలురాయిని చేరుకున్నాయి. మార్కెట్‌లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపుతుండడమే ఇందుకు కారణం.
సగటున 30 లక్షల ఖాతాలు!
గత 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 3.70 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి మంచి రాబడులు వస్తుండటంతో ప్రతి నెలా సగటున 30 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అవ్వడం గమనార్హం.
మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయ్!
Demat account openings in FY24 :భారతీయ పెట్టుబడిదారులు 2021 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.4 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) దేశీయ మార్కెట్‌పై పెంచిన అంచనాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత్ మార్కెట్‌పై చూపుతున్న ఆసక్తి, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెరగడం - ఇలా పలు కారణాలతో డీమ్యాట్ ఖాతాలు విపరీతంగా పెరిగాయి. దీనితో 2024 ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య ఏకంగా 3.7 కోట్లకు చేరింది. అంతకుముందటి (2023) ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వీటి సంఖ్య 32 శాతం అధికం కావడం గమనార్హం.