తెలంగాణ

telangana

ETV Bharat / business

రియల్ ఎస్టేట్ లేటెస్ట్ రిపోర్ట్- హైదరాబాద్​లో అతితక్కువ గ్రోత్- టాప్ 8 సిటీస్​లో లాస్ట్! - HOUSING PRICES IN INDIA

భారత్​లోని ప్రధాన నగరాల్లో పెరిగిన రియల్​ ఎస్టేట్​ హౌసింగ్ ధరలు- దిల్లీ-ఎన్​సీఆర్​లో అత్యధికంగా 57శాతం వృద్ధి- హైదరాబాద్​లో తక్కువగా 7శాతం పెరుగుదల

Housing Prices In Top Cities In India
Housing Prices In Top Cities In India (Getty Images, ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 3:58 PM IST

Housing Prices In Top Cities In India :భారత్​లోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 7శాతం నుంచి 57శాతం రేంజ్​లో పెరిగాయని రియల్​ ఎస్టేట్ ప్రాపర్టీ పోర్టల్​ ప్రాప్​టైగర్​ నివేదక తెలిపింది. జులై-సెప్టెంబర్​ త్రైమాసికంలో దిల్లీ-ఎన్​సీఆర్​ ప్రాంతంలో ఎక్కువగా 57శాతం పెరుగుదల కనిపించిందని వెల్లడించింది. దేశంలోని ప్రముఖ రియల్​ఎస్టేట్​ హబ్​లలో ఒకటైన హైదరాబాద్​లో తక్కువగా 7శాతం పెరుగుదల నమోదైందని నివేదిక పేర్కొంది.

గత ఏడాది జులై-సెప్టెంబర్ కాలంలో దిల్లీ-ఎన్​సీఆర్​లో ఒక చదరపు అడుగు ధర రూ.5,105 ఉండగా, ఈ ఏడాది అదే సమయంలో 57శాతం పెరిగి రూ.8,017కు చేరింది. ఇక హైదరాబాద్​లో గతేడాది రూ.6,580 ఉండగా, ఈ ఏడాది 7శాతం వృద్ధితో రూ.7,050కి చేరింది. హై-ఎండ్ ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్​ కారణంగా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని ప్రాప్​టైగర్ వెల్లడించింది.

ధరల పెరుగుదలకు కారణాలివే!
ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేసే అంశాలను ప్రాప్​టైగర్​ తన నివేదికలో ప్రస్తావించింది. "గత 10 పాలసీ సమావేశాల్లో రిజర్వ్​ బ్యాంక్​ రెపో రేటు 6.5శాతాన్ని యథాతథంగా ఉంచింది. ఫలితంగా ధరలు తగ్గకుండా అదే స్థాయిలో ఉంటున్నాయి. దీంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఎక్కువ వడ్డీలు చెల్లిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తిపై ఇది ప్రభావం చూపిస్తోంది" అని నివేదికలో పేర్కొంది.

ఆస్తి విలువలో స్థిరమైన పెరుగుదల, భారత్ రెసిడెన్సియల్ రియల్​ ఎస్టేట్​ రెసిలియెన్స్​, వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తోందని BPTP సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరీందర్ ధిల్లాన్ అన్నారు. దిల్లీ-ఎన్​సీఆర్, గురుగ్రామ్​, ఫరీదాబాద్​ వంటి కీలక మార్కెట్లలో ఇళ్ల ధరలు పెరిగాయని, ఈ ప్రాంతాల్లో నాణ్యమైన రెసిడెన్సియల్ ప్రాజెక్టులకు డిమాండ్​ ఎక్కువగా ఉందని ధిల్లాన్ చెప్పారు. ఆయా చోట్ల మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ఆధునిక జీవనశైలి సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దానివల్ల గృహ కొనుగోలుదారులకు, బిల్డర్లకు పెట్టుబడి అవకాశాలు వస్తాయని తెలిపారు.

2023-2024 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ధరలు(ఒక చదరపు అడుగుకు)
ప్రాంతం 2023 2024 పెగురుదల(%)
దిల్లీ-ఎన్​సీఆర్ రూ.5,105 రూ.8,017 57
చెన్నై రూ.5,885 రూ.7,179 22
కోల్​కతా రూ.4,797 రూ.5,844 22
అహ్మదాబాద్ రూ.3,900 రూ.4,736 21
ముంబయి రూ.10,406 రూ.12,590 21
పుణె రూ.5,892 రూ.6,953 18
బెంగళూరు రూ.6,550 రూ.7,512 15
హైదరాబాద్ రూ.6,580 రూ.7,050 7

సౌత్​లో తగ్గిన ప్రాపర్టీ లాంఛ్​లు!
అయితే దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టుల లాంఛ్​లు, హౌసింగ్ యూనిట్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ కరెక్షన్​కు(10శాతం కంటే ఎక్కువగా 20శాతం కంటే తక్కువగా మార్కెట్ పడిపోవడం) నిదర్శనమని బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేడీ అన్నారు. డిమాండ్​-సరఫరా సమతుల్యతను కొనసాగించడం, అన్​సోల్డ్​ యూనిట్స్​​ను నివారించడం వంటి- పెరుగుతున్న ధరలను అరికట్టే చర్యల వల్ల ఇలా జరుగుతోందన్నారు.

రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్‌-5 టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు వెయిట్ చేస్తున్నారా? - అయితే మీకు ఇదే సువర్ణ అవకాశం! - Real Estate Market In Hyderabad

ABOUT THE AUTHOR

...view details