Infosys CEO About 2022-Batch Onboarding Delays : తాముఆఫర్ లెటర్ ఇచ్చిన ప్రతి ఒక్కరినీ ఉద్యోగంలో చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు. అయితే జాయినింగ్ తేదీల్లో కాస్త మార్పు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ కంపెనీ 2022 ఏప్రిల్‌లో 2000 మంది ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చింది. వీరిని సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ రోల్స్ కోసం తీసుకుంటున్నట్లు తెలిపింది. కానీ ఇప్పటి వరకు వారిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీనితో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం 'నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్'(NITES) ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లలో ఇన్ఫోసిస్ చేసిన తీవ్ర జాప్యం వల్ల 2000 మందికిపైగా నిపుణులకు తీవ్రమైన నష్టం జరుగుతోందని NITES కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఇన్ఫోసిస్ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని ఈ సంస్థ ఆరోపించింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని NITES కార్మిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. దీనితో సలీల్ పరేఖ్ తాజా వ్యాఖ్యలు చేశారు.