తెలంగాణ

telangana

ETV Bharat / business

తక్కువ బడ్జెట్లో మంచి డీజిల్ కారు కొనాలా? ఈ టాప్​-10 మోడల్స్​పై ఓ లుక్కేయండి! - best Mahindra Diesel Cars

Cheapest Diesel Cars In India 2024 : మీరు మంచి డీజిల్ కారు కొనాలని అనుకుంటున్నారా? ఎస్​యూవీ కార్స్​ అయితే బెటరా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్-10 డీజిల్ కార్లపై ఓ లుక్కేద్దాం రండి.

Best diesel cars in 2024
Most affordable diesel cars

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 12:05 PM IST

Updated : Feb 28, 2024, 12:29 PM IST

Cheapest Diesel Cars In India 2024 : డీజిల్ ఇంజిన్​ కారులు తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. అందుకే వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. మరి మీకు కూడా డీజిల్ కార్లు అంటే ఇష్టమా? అయితే అత్యంత సరసమైన ధరల్లో లభిస్తున్న డీజిల్​, ఎస్​యూవీ కార్లుపై ఓ లుక్కేద్దాం రండి.

1. Tata Altroz Diesel Car Features : భారతదేశంలో అత్యంత సరసమైన ధరకు లభిస్తున్న ఏకైక డీజిల్ పవర్డ్​ హ్యాచ్​బ్యాక్​ ఇది. ఈ టాటా ఆల్ట్రోజ్​ కారులో 1.5 లీటర్​, ఫోర్-సిలిండర్​ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 90 హెచ్​పీ పవర్​, 200 ఎన్​ఎం టార్క్​ జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్​ మాన్యువల్ గేర్​బాక్స్​తో అనుసంధానమై పనిచేస్తుంది. ఈ కారు ప్యూయెల్ ఎఫీషియన్సీ 23.6 kmpl. ఈ టాటా ఆల్ట్రోజ్ ధర సుమారుగా రూ.8.9 లక్షల నుంచి రూ.10.8 లక్షల వరకు ఉంటుంది.

2. Kia Sonet Diesel Car Features : ఈ కియా సోనెట్ అనేది మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్​యూవీ. ఇది పెట్రోల్​, టర్బో-పెట్రోల్​, టర్బో-డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. 1.5 లీటర్​, ఫోర్​-సిలిండర్​ టర్బో-డీజిల్​ ఇంజిన్ 116 హెచ్​పీ పవర్, 250 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్​ ఆటోమేటిక్​/ 6-స్పీడ్​ మాన్యువల్ గేర్​బాక్స్​తో ఆప్షన్లతో వస్తుంది. ఈ కియా సోనెట్​ ధర సుమారుగా రూ.9.79 లక్షల నుంచి రూ.15.69 లక్షల వరకు ఉంటుంది.

3. Mahindra Bolero NeoDiesel Car Features : మహీంద్రా బొలెరొ నియో అనేది ఒక బెస్ట్ ఎస్​యూవీ. దీనిలో 1.5 లీటర్,​ త్రీ-సిలిండర్​ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 100 హెచ్​పీ పవర్​, 260 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్​ మాన్యువల్​ గేర్​ బాక్స్​తో అనుసంధానమై పనిచేస్తుంది. అయితే రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్​ నిబంధనలకు అనుగుణంగా ఈ మహీంద్రా బొలెరో నియోను అప్​డేట్ చేయలేదు. అయినప్పటికీ మంచి డీజిల్ వెహికల్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో ఈ కారు ధర సుమారుగా రూ.9.90 లక్షల నుంచి రూ.12.15 లక్షల వరకు ఉంటుంది.

4. Mahindra Bolero Diesel Car Features : భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన కార్లలో మహీంద్రా బొలెరో ఒకటి. గత 20 ఏళ్లుగా ఇది బెస్ట్ సెల్లింగ్​ కారుగా కొనసాగుతోంది. ఈ కారులో 1.5 లీటర్​, త్రీ-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 76 హెచ్​పీ పవర్​, 210 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనికి అనుసంధానంగా ఉన్న 5-స్పీడ్​ మాన్యువల్ గేర్​బాక్స్​ వెనుక చక్రాలకు పవర్​ అందిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.9.90 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుంది.

5. Mahindra XUV300 Diesel Car Features : ఈ మహీంద్రా ఎక్స్​యూవీ300 కారుకు 5-స్టార్​ గ్లోబల్ ఎన్​సీఏపీ రేటింగ్ ఉంది. ఈ కారులో 1.5 లీటర్​, ఫోర్​-సిలిండర్​ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 117 హెచ్​పీ పవర్​, 300 ఎన్​ఎం టార్క్​ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్​ మాన్యువల్​/ ఏఎంటీ గేర్ బాక్స్ ద్వారా ఫ్రంట్​ వీల్​కు పవర్​ డెలివరీ అవుతుంది. డీజిల్ కారు కొనాలని అనుకునేవారికి ఈ కాంపాక్ట్ మహీంద్రా ఎస్​యూవీ కారు మంచి ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.9.92 లక్షల నుంచి రూ.14.76 లక్షలు ఉంటుంది.

6. Hyundai Venue Diesel Car Features : ఈ హ్యుందాయ్ వెన్యూ అనేది కియా సోనెట్​కు కజిన్. ఈ హ్యుందాయ్ వెన్యూ కారు అనేక వేరియంట్లలో లభిస్తుంది. అయితే ఈ కారులోని 1.5 లీటర్​, ఫోర్​-సిలిండర్​ టర్బో-డీజిల్ ఇంజిన్​ 116 హెచ్​పీ పవర్​, 250 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. అయితే సోనెట్ కారులా కాకుండా, ఈ కారులో కేవలం 6-స్పీడ్​ మాన్యువల్ గేర్​ బాక్స్​ మాత్రమే ఉంది. మార్కెట్లో ఈ హ్యుందాయ్ వెన్యూ కారు ధర సుమారుగా రూ.10.71 లక్షల నుంచి రూ.13.44 లక్షలు వరకు ఉంటుంది.

7. Tata Nexon Diesel Car Features : భారతదేశంలోని బెస్ట్ సెల్లింగ్ ఎస్​యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. దీనికి 5-స్టార్​ గ్లోబల్ ఎన్​సీఏపీ రేటింగ్ ఉంది. కనుక ప్రయాణికుల భద్రతకు హామీ ఉంటుంది. ఇది టర్బో పెట్రోల్, టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 1.5 లీటర్​, ఫోర్​-సిలిండర్​ టర్బో-డీజిల్ ఇంజిన్​ 115 హెచ్​పీ పవర్​, 260 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. పైగా ఇది 6-స్పీడ్​ మాన్యువల్​, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ గేర్​బాక్స్​తో అనుసంధానమై ఉంటుంది. పట్టణాల్లో ప్రయాణించడానికి ఈ కారు అనువుగా ఉంటుంది. మార్కెట్లో ఈ కారు ధర సుమారుగా రూ.11.10 లక్షల నుంచి రూ.15.60 లక్షలు వరకు ఉంటుంది.

8. Mahindra Thar Diesel Car Features : ఈ మహీంద్రా థార్​ రెండు డీజిల్ ఇంజిన్​ ఆప్షన్లతో వస్తుంది. 1.5 లీటర్,​ ఫోర్-సిలిండర్​ టర్బో-డీజిల్​ ఇంజిన్​ 118 హెచ్​పీ పవర్​, 300 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 2.2 లీటర్​ ఫోర్​-సిలిండర్​ టర్బో-డీజిల్ ఇంజిన్​ 132 హెచ్​పీ పవర్, 300 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. మొదటి ఇంజిన్​ 6-స్పీడ్​ మాన్యువల్​ గేర్​బాక్స్​తో అనుసంధానమై పనిచేస్తుంది. రెండో ఇంజిన్​ 6-స్పీడ్​ మాన్యువల్​ & ఆటోమేటిక్​ గేర్​బాక్స్ ఆప్షన్లు రెండూ కలిగి ఉంటుంది. ఈ మహీంద్రా థార్​ ధర సుమారుగా రూ.11.25 లక్షల నుంచి రూ.17.20 లక్షల వరకు ఉంటుంది.

9. Kia Seltos Diesel Car Features : ఈ కియా సెల్టోస్​లో చాలా పవర్​ట్రైన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో 1.5 లీటర్,​ ఫోర్​-సిలిండర్​ టర్బో-డీజిల్ ఇంజిన్ 116 హెచ్​పీ పవర్, 250 ఎన్​ఎం టార్క్​ జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్​ మాన్యువల్, 6-స్పీడ్​ ఏటీ గేర్​బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. దూర ప్రయాణాలు చేయాలని అనుకునేవారికి ఇది మంచి ఛాయిస్​ అవుతుంది. మార్కెట్లో ఈ కియా సెల్టోస్​ కారు ధర సుమారుగా రూ.12 లక్షల నుంచి రూ.20.30 లక్షలు ఉంటుంది.

10. Hyundai Creta Diesel Car Features : మిడ్​సైజ్ ఎస్​యూవీల్లో డీజిల్ ఇంజిన్లు ఉన్న కార్లు హ్యుందాయ్​ క్రెటా, కియా సెల్టోస్​ మాత్రమే. హ్యుందాయ్ క్రెటాలో 1.5 లీటర్,​ ఫోర్-సిలిండర్​ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 116 హెచ్​పీ, 250 ఎన్​ఎం టార్క్​ జనరేట్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్​ మాన్యువల్​, 6-స్పీడ్​ ఆటోమేటిక్​ గేర్​బాక్స్​ అనుసంధానమై ఉంటుంది. ఇది స్మూత్​ డ్రైవింగ్​ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. మార్కెట్లో హ్యుందాయ్​ క్రెటా కారు ధర సుమారుగా రూ.12.35 లక్షల నుంచి రూ.20.15 లక్షల వరకు ఉంటుంది.

అప్​డేటెడ్ వెర్షన్స్​ - ధరలు : వాహన ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన 'భారత్​ స్టేజ్​ 6 ఫేజ్​ 2 ఉద్గారాల నిబంధనలు' (రియల్ డ్రైవింగ్​ ఎమిషన్స్) 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. దీనిలో భాగంగా అప్​డేటెడ్​ డీజిల్ ఇంజిన్​లను మార్చడానికి ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కృషి చేస్తున్నాయి. కానీ దీని వల్ల డీజిల్ కార్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

బైక్ ఇన్సూరెన్స్​ తీసుకోవాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

HDFC నుంచి 4 కొత్త బిజినెస్‌ క్రెడిట్‌ కార్డులు - బెనిఫిట్స్​ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Last Updated : Feb 28, 2024, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details