Cars Under Rs 5 Lakh : ప్రస్తుత రోజుల్లో కారు నిత్యావసర వస్తువుగా మారిపోయిందని చెప్పాలి. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే కారు తప్పనిసరి అయిపోయింది! బైక్‌పై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వెళ్లలేరు. అందుకే చాలా మంది కారు కొనాలని ఫ్లాన్ చేస్తుంటారు. కొంత మంది ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తుంటే, మరికొందరు వారి రేంజ్‌కు తగ్గట్లుగా తక్కువ ధరలో లభించే కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అలా మీరు కూడా రూ.5 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలనుకుంటున్నారా? ఓ సారి ఈ మోడల్స్ గురించి తెలుసుకోండి.
Maruti Suzuki Alto K10
మారుతి సుజుకి ఆల్టో కే10 అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్. ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్, పెట్రోల్+సీఎన్జీ ఆప్షన్స్‌లో ఇది లభిస్తుంది. లీటరుకు 27 కి.మీ మైలేజ్ ఇస్తుంది. 8 వేరియంట్లు, 6 కలర్ ఆప్షన్స్‌లో ఈ కారు లభిస్తుంది.
Maruti Suzuki S-Presso
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ధర రూ.4.27 - రూ.6.12 లక్షల వరకు ఉంటుంది. 8 వేరియంట్లు, 6 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్లను బట్టి లీటరుకు 24.8 నుంచి 32.7 కి.మీ మైలేజ్ ఇస్తాయి. పెట్రోల్, పెట్రోల్+సీఎన్జీ ఆప్షన్స్‌లో ఈ కారు లభిస్తుంది.
Renault Kwid
రెనో క్విడ్ కారు ధర మార్కెట్లో రూ.4.70 - రూ.6.33 లక్షల వరకు ఉంటుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్లను బట్టి లీటరుకు 22 కి.మీ నుంచి 23 కి.మీ మైలేజ్‌ను ఇస్తాయి. 7 వేరియంట్లు, 6 అందమైన రంగుల్లో ఈ కారు లభిస్తుంది.