తెలంగాణ

telangana

మీ కారు లైఫ్​​ టైమ్​​ పెరగాలా? అయితే ఈ సింపుల్ టిప్స్​ పాటించండి!

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 9:25 AM IST

Car Lifespan Tips in Telugu : కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న కారును సాధ్యమైనంత ఎక్కువ కాలం వాడాలని అందరూ భావిస్తుంటారు. కారుతో మనిషికి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంటుంది. దీనివల్ల పాత కారును వదులుకోవడానికి ఎవరు ఇష్టపడారు. ఈ క్రమంలో మనకున్నది కారు లైఫ్‌ను పెంచుకోవడం. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం.

Car Lifespan Tips in Telugu
Car Lifespan Tips in Telugu

Car Lifespan Tips in Telugu : కారు ఉన్న ప్రతీ ఒక్కరు దాని రొటీన్ మెయింటెనెన్స్‌ను ఎలాగూ చేస్తుంటారు. కానీ డైలీ మెయింటెనెన్స్‌పై ఫోకస్ చేసేది మాత్రం చాలా తక్కువ మందే. ఈ రెండు రకాల మెయింటెనెన్స్‌లు చేసే వారి కార్లు ఏళ్లు గడిచినా బాగా నడుస్తుంటాయి. మైలేజీతో పాటు మంచి జర్నీ అనుభవాన్ని అందిస్తుంటాయి. రిపేర్లు కూడా పెద్దగా రావు. అయితే కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే కారునే సాధ్యమైనంత ఎక్కువ కాలం వాడాలని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. ఎందుకంటే రెండో కారును కొనాలంటే ఎంత ఖర్చవుతుందో వారికి బాగా తెలుసు. ఉన్న కారును ఎక్కువ కాలం మంచిగా పని చేసేలా చేయాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.

టైర్ల‌లో త‌గినంత గాలి
కారును ఎక్కువగా వాడితే ప్రధానంగా ఆ భారమంతా పడేది టైర్లపైనే. అందుకే టైర్లను మంచిగా ఉండేలా చూసుకోవాలి. రాళ్లురప్పలు ఉన్న ఏరియాల్లో తిరిగితే టైర్లు త్వరగా దెబ్బతింటాయి. మంచి రోడ్లపై రాకపోకలు సాగిస్తే వాటి లైఫ్ ఎలాగూ పెరుగుతుంది. టైర్లలో గాలి ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి మీ దగ్గర టైర్ గేజ్‌ను ఉంచుకోవాలి. గాలి తక్కువగా ఉన్నా డ్రైవింగ్ చేస్తే టైర్ల లైఫ్ టైమ్ వేగంగా తగ్గిపోతుంది. కారు టైర్లలో గాలి పీడనం 32- 35 పీఎస్ఐ మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ కొత్త టైర్లను కొనాల్సి వస్తే బ్రాండెడ్‌వి కొనేందుకే మొగ్గుచూపాలి.

స్టీరింగ్ సిస్టమ్​ విషయంలో జాగ్రత్త
కారులో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే మరో భాగం స్టీరింగ్. కారును వాడినప్పుడల్లా దీన్ని తప్పకుండా మనం వినియోగిస్తుంటాం. స్టీరింగ్ సిస్టమ్‌లో చిన్న సమస్య వచ్చినా, దాని ప్రభావం మొత్తం కారు పనితీరుపై చూపిస్తుంది. డ్రైవింగ్‌లోనూ అసౌకర్యం ఉంటుంది. స్టీరింగ్ కదలిక ఫ్రీగా ఉండటానికి కారును సర్వీసింగ్ చేయించే టైంలో అందులోని లిక్విడ్‌ను మార్పించాలి.

రెగ్యుల‌ర్​ చెక‌ప్​ మస్ట్​
బ్రేక్‌లు కారులో అత్యంత ముఖ్యమైన పార్ట్స్. ఇవి సరిగ్గా లేకుంటే అసలుకే ఎసరు వస్తుంది. ప్రమాదాలు జరిగే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. వాటి సెట్టింగ్స్ సరిగ్గా ఉన్నాయో లేదో అనే విషయాన్ని మెకానిక్‌ ద్వారా తెలుసుకోవాలి. బ్రేక్ ప్యాడ్‌లలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వాటిని మార్చేయండి. కారు ఇంకా బాగా పని చేయాలంటే బ్రేక్‌లోని లిక్విడ్‌ను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.

లికేజీ రాకుండా చూసుకోవాలి
కారు పాతదిగా మారుతున్న కొద్దీ బాగా ప్రభావితమయ్యేది ఫ్యూయల్ లైన్. ఇది పాతబడ్డాక పగుళ్లు ఏర్పడుతాయి. ఫ్యూయల్ లైన్ నుంచి ఇంధనం లీకేజీ జరిగే రిస్క్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు కొత్త ఫ్యూయల్ లైన్‌ సెటప్‌ను మార్పించుకోవాలి. ప్రతి 30,000- 40,000 కిలో మీటర్ల సర్వీసు తర్వాత కారు ఫ్యూయల్ లైన్‌లోని ఇంధన ఫిల్టర్‌ను మార్చడం మంచిది.

సీట్‌బెల్ట్‌లను మార్చుకోవాలి
కారు పాతపడే కొద్దీ అందులోని సీట్ బెల్టులు ఫిట్‌నెస్‌ను కోల్పోతుంటాయి. వాటిని మార్చేసి కొత్తవి వేసుకోవాలి. ఊహించని ప్రమాదాలు జరిగినప్పుడు సీటు బెల్టులే ప్రాణాలు కాపాడతాయని గుర్తుంచుకోండి. వాహనం భారీ కుదుపులకు గురైనప్పుడు కూడా సీటు బెల్టులు మనల్ని రక్షిస్తాయి. కొత్త సీటు బెల్టులు కొనేటప్పుడు మెకానిక్‌ని సంప్రదించండి. అతడి సలహా మేరకు మన్నికైన సీటు బెల్టును కొనడం మంచింది.

MG నుంచి మరో 3 ఎలక్ట్రిక్ కార్స్ - ఒక స్పోర్ట్స్ కార్, ఫ్యామిలీస్ కోసం 2 మోడల్స్

కొత్త కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-5 వెహికల్స్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details