Bike Maintenance Tips In Rainy Season :వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపైన మొత్తం నీరు చేరిపోతుంటుంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. ఈ రోడ్లపైన నిత్యం బైక్ రైడ్ చేస్తే.. తర్వాత అవి రిపేర్‌కు వస్తుంటాయి. కొన్నిసార్లు ప్రయాణం మధ్యలోనే బైక్‌లు ఆగిపోతాయి. మరికొన్ని సార్లు అస్సలు స్టార్ట్ కావు. చాలా మంది వాహనదారులు వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. అయితే.. ఈ సీజన్‌లో వాహనదారులు కొన్నిటిప్స్ పాటించడంవల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా రయ్య్‌మని దూసుకెళ్లవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్టాండ్ విషయంలో జాగ్రత్త!
చాలా మంది వాహనదారులు ఇంట్లో లేదా ఎక్కడైనా బైక్‌ను పార్కింగ్ చేసినప్పుడు ఎక్కువగా సైడ్ స్టాండ్ వేస్తుంటారు. కానీ, వర్షాకాలంలో బైక్ సైడ్ స్టాండ్ వేయడం కంటే.. సెంటర్ స్టాండ్ వేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. సెంటర్ స్టాండ్ వేస్తే ప్లగ్‌లోకి నీరు చేరదు. దీనివల్ల బైక్ త్వరగా స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు.
ప్లగ్ తీయాలి :
వర్షాకాలంలో ఒక్కొసారి బైక్ వర్షంలో తడవడం వల్ల ప్లగ్‌లోకి నీరు చేరుతుంది. దీనివల్ల బైక్ స్టార్ట్ కాదు. ఇలాంటప్పుడు ఒకసారి ఇంజిన్‌ప్లగ్ తీసి పొడి వస్త్రంతో తుడిచి మళ్లీ బిగించాలి. ఇలా చేయడం వల్ల బైక్ త్వరగా స్టార్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మీరు బైక్ లవర్సా? ఈ పిచ్చెక్కించే 'కాన్సెప్ట్ బైక్స్'ను ఎప్పుడైనా చూశారా?
క్లీన్ చేయండి!
మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బైక్‌ను శుభ్రంగా నీటితో కడగండి. తర్వాత పొడి వస్త్రంతో తుడవండి.
సర్వీసింగ్ :
మీ బైక్‌ను టైమ్ టూ టైమ్ సర్వీసింగ్ చేయించండి. బ్రేక్స్, టైర్లు, లైట్లు, బ్యాటరీ వంటివి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయించుకోండి. దీనివల్ల ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
- పెట్రోల్ ట్యాంక్ క్యాప్, కవర్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. ట్యాంక్‌లోకి వర్షం నీరు వెళ్తే బైక్ స్టార్ట్ అవ్వకుండా మొరాయిస్తుంది.
- అలాగే బైక్ చైన్‌లో తరచూ ఆయిల్ వేయండి. ఎందుకంటే.. వర్షం నీటి వల్ల చైన్ దెబ్బతింటుంది. ఆయిల్ వేయడం వల్ల చైన్ లైఫ్ టైమ్ పెరుగుతుందని నిపుణులంటున్నారు.
- చాలా కాలంగా బైక్ టైర్‌లు మార్చకుండా ఉంటే.. కొత్త టైర్‌లను మార్చండి.
వర్షాకాలంలో బైక్ నడుపుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి :
- ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు.. మధ్యలో భారీగా వర్షం పడుతుంటే బైక్ రైడ్ చేయకపోవడం మంచిది.
- అలాగే వర్షంలో బయటకు వెళ్తున్నప్పుడు రెయిన్ కోట్, హెల్మెట్ వంటి వాటిని తప్పనిసరిగా ధరించండి.
- వర్షం పడుతున్న టైమ్‌లో స్పీడ్‌గా బండి నడపకండి. బైక్ స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- వర్షకాలంలో వాహనదారులు ఈ టిప్స్ పాటించడం వల్ల.. సేఫ్‌గా ప్రయాణించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్ బటన్' ఎప్పుడైనా గమినించారా?.. అది ఎందుకో తెలుసా?
మీ బైక్ మైలేజ్ తగ్గుతోందా? ఈ టిప్స్ పాటిస్తే ఓ రేంజ్లో పెరగడం గ్యారెంటీ!