How To Increase Bike Mileage :నేడు మన జీవితంలో బైక్‌లు నిత్యావసర ప్రయాణ సాధనంలా మారిపోయాయి. విద్యార్థులు కాలేజ్‌కు వెళ్లాలన్నా, ఉద్యోగులు ఆఫీస్‌కు చేరుకోవాలన్నా బైక్ ఉండాల్సిందే. అసలు ఏ పని కోసమైనా బైక్‌పై వెళ్లాల్సిందే. అయితే చాలా మంది బైక్ నడిపేటప్పుడు తెలిసీ, తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల బైక్ మైలేజ్ బాగా తగ్గిపోతుంది. దీనితో తమ బండి - కంపెనీ వాళ్లు చెప్పిన మైలేజ్ ఇవ్వట్లేదు అని వాపోతుంటారు. మరి మీ బైక్ కూడా ఇలానే తక్కువ మైలేజ్ ఇస్తోందా? అయితే మీరేమీ చింతించకండి. కొన్ని చిట్కాలు పాటిస్తే, మీ బైక్ మైలేేజ్ను బాగా పెంచుకోవచ్చని, ఇంధనం ఖర్చులు కూడా ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గేర్ షిఫ్టింగ్ : సరైన సమయంలో గేర్లు మార్చకపోతే, బైక్ మైలేజ్ క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే టూ-వీలర్ నడిపేటప్పుడు మీ వేగానికి తగినట్లుగా గేర్స్ మార్చుతూ ఉండాలి. అలాకాకుండా, చాలా వేగంగా వెళ్తూ, తక్కువ గేర్ ఉపయోగిస్తే అది ఇంజిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. పైగా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. కనుక మీ బైక్ మంచి మైలేజ్ ఇవ్వాలంటే, మీ స్పీడ్‌కి, రోడ్డు పరిస్థితికి అనుగుణంగా గేర్స్ మారుస్తూ ఉండాలి. ఖాళీగా ఉన్న రోడ్లపై స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు టాప్ గేర్‌లో వెళ్లాలి. నిదానంగా బైక్ డ్రైవ్ చేస్తుంటే సెకండ్ లేదా థర్డ్ గేర్‌లో వెళ్లాలి. ఇలా వెళ్లడం వల్ల మార్గం మధ్యలో బైక్ ఆగకుండా, మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. పైగా మైలేజ్ కూడా పెరుగుతుంది.
బ్రేక్‌పై కాలు పెట్టి డ్రైవ్ చేయవద్దు : చాలా మంది బ్రేక్ పెడల్పై కాలు పెట్టి డ్రైవ్ చేస్తుంటారు. సేఫ్టీ పరంగా ఇది మంచిదే. కానీ డ్రైవ్ చేసేటప్పుడు ఇలా బ్రేక్ పెడల్పై కాలు పెడితే, దానిపై కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల కూడా మీ బైక్ మైలేజ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే బ్రేక్ పెడల్పై కాలు పెట్టండి.