Best Suspension Cars :కారు ప్రయాణం సాఫీగా సాగాలంటే దాని సస్పెన్షన్ సిస్టమ్ చాలా బాగుండాలి. ఎందుకంటే గుంతలు పడిన రోడ్లలో, ఎత్తుపల్లాలు ఉన్న రహదారుల్లో సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే, అత్యుత్తమ సస్పెన్షన్ ఉన్న కార్లు ఉండాలి. లేదంటే వెన్ను నొప్పి, మెడ నొప్పి, నడుం నొప్పితో బాధపడాల్సి వస్తుంది. కొన్ని సార్లు రోడ్లు బాగోలేకపోవడం వల్ల కారు కండిషన్ తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మంచి సస్పెన్షన్ ఉన్న కారును తీసుకోవడం వల్ల ప్రయాణం భద్రంగా, సాఫీగా సాగుతుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో మంచి సస్పెన్షన్ సిస్టమ్ ఉన్న టాప్-10 కార్లు గురించి తెలుసుకుందాం.
1. Tata Altroz Specifications : టాటా ఆల్ట్రోజ్ కారు ఇంటీరియర్ విశాలంగా ఉంటుంది. ఈ కారులో మంచి సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఇందులో ఉన్నాయి.
- మ్యాక్స్ పవర్ : 88-110 bhp
- మ్యాక్స్ టార్క్ : 115-200 Nm
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
- ఇంజిన్ : 1197 సీసీ (పెట్రోల్)/ 1497 సీసీ (డీజిల్)
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, డీజిల్
- మైలేజ్ : 18.5 Kmpl (పెట్రోల్), 23 Kmpl (డీజిల్)
- బాడీ టైప్ : హ్యాచ్‌బ్యాక్
- ఎక్స్-షోరూమ్ ధర : రూ.6,35,000
Tata Altroz Key Features :
- పవర్ స్టీరింగ్
- పవర్ విండోస్ ఫ్రంట్
- యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్
- ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్
- ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్
- సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
2. Honda Jazz Specifications : హోండా జాజ్లోమంచి డిజైన్, సన్‌రూఫ్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, అధునాతన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఈ కారులో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. దీనిలోని సస్పెన్షన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అందుకే ఈ కారుపై గుంతలు పడిన రోడ్లపైన కూడా సాఫీగా ప్రయాణం చేయవచ్చు.
- మ్యాక్స్ పవర్ : 88.7 bhp @ 6,000 rpm
- మ్యాక్స్ టార్క్ : 110 Nm @ 4,800 rpm
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
- ఇంజిన్ : 1199 సీసీ (పెట్రోల్)
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- మైలేజ్ : 18.5 Kmpl (పెట్రోల్)
- బాడీ టైప్ : హ్యాచ్‌బ్యాక్
- ఎక్స్-షోరూమ్ ధర : రూ.5.60 లక్షలు - రూ.9.40 లక్షలు
Honda Jazz Key Features :
- పవర్ స్టీరింగ్
- పవర్ విండోస్ ఫ్రంట్
- డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్
- ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్
3. Maruti Suzuki Baleno Specifications :మారుతి సుజుకి బాలెనో మంచి ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మంచి మైలేజ్‌ను కూడా ఇస్తుంది.
- మ్యాక్స్ పవర్ : 88 bhp
- మ్యాక్స్ టార్క్ : 113 Nm
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
- ఇంజిన్ : 1197 సీసీ (పెట్రోల్)
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, సీఎన్జీ
- మైలేజ్ : 22.9 Kmpl (పెట్రోల్), 30.61 Kmpl (సీఎన్జీ)
- బాడీ టైప్ : హ్యాచ్‌బ్యాక్
- ఎక్స్ షోరూమ్ ధర : రూ.6,56,000
Maruti Suzuki Baleno Features :
- పవర్ స్టీరింగ్
- పవర్ విండోస్ ఫ్రంట్
- యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్
- డ్రైవర్ ఎయిర్ బ్యాగ్
- ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్
- ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్
- స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
- ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్
4. Maruti Swift Specifications :మారుతి స్విఫ్ట్ కారు ఒక మంచి స్టైలిష్, స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ మోడల్. ఈ కారు లోపలి భాగం విశాలంగా ఉంటుంది. ఇది కూడా మంచి సస్పెన్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
- మ్యాక్స్ పవర్ : 89 bhp (పెట్రోల్), 76 bhp (సీఎన్జీ)
- మ్యాక్స్ టార్క్ : 113 Nm (పెట్రోల్), 98.5 Nm )(సీఎన్జీ)
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ (పెట్రోల్), మాన్యువల్ (సీఎన్జీ)
- సీటింగ్ కెపాసిటీ : 5
- ఇంజిన్ : 1197 సీసీ (పెట్రోల్)
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, సీఎన్జీ
- మైలేజ్ : 23 Kmpl (పెట్రోల్),31 Kmpl (సీఎన్జీ)
- బాడీ టైప్ : హ్యాచ్‌బ్యాక్
- ఎక్స్-షోరూమ్ ధర : రూ.6,70,000
Maruti Swift Key Features :
- వైర్‌లైస్ అండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే
- మంచి ఇంధన సామర్థ్యం
- మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్
- సౌకర్యవంతమైన క్యాబిన్
5. Hyundai Grand i10 NIOS Specifications :హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు లోపల బోలెడు మంచి ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గతుకుల రోడ్లపై కూడా మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు.
- మ్యాక్స్ పవర్ : 99 bhp
- మ్యాక్స్ టార్క్ : 172 Nm
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్
- సీటింగ్ కెపాసిటీ : 5
- ఇంజిన్ : 1197 సీసీ (పెట్రోల్)
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- మైలేజ్ : 21 Kmpl (పెట్రోల్)
- బాడీ టైప్ : హ్యాచ్‌బ్యాక్
- ఎక్స్-షోరూమ్ ధర : రూ.5.42 లక్షలు - రూ.8.45 లక్షలు
Maruti Swift Key Features :
- పవర్ స్టీరింగ్
- పవర్ విండోస్ ఫ్రంట్
- యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్
- ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్
- మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్
- వైర్లెస్ ఫోన్ ఛార్జర్
- 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
- యాపిల్ కార్ప్లే అండ్ అండ్రాయిడ్ ఆటో
- డిజిటల్ ఇన్స్ట్రమెంట్ క్లస్టర్