తెలంగాణ

telangana

ETV Bharat / business

మంచి మైలేజ్​ ఇచ్చే స్కూటీ కొనాలా? ఈ టాప్​-6 మోడల్స్​పై ఓ లుక్కేయండి! - లక్షలోపు ధర ఉన్న స్కూటీలు

Best Scooty Under 1 Lakh : మంచి మైలేజ్​ ఇచ్చే స్కూటీ కొనాలనుకుంటున్నారా? ఏ మోడల్​ స్కూటీ కొనాలో తెలియక కంగారు పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్​-6 స్కూటీలపై ఓ లుక్కేద్దాం రండి.

Best Scooty Under 1 Lakh
Best Scooty Under 1 Lakh

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 12:03 PM IST

Best Scooty Under 1 Lakh :వాహనరంగ మార్కెట్​లో స్కూటీలకు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే వీటిని మహిళలు, పురుషులు అందరూ ఈజీగా నడపగలరు. అందుకే ఎక్కువ మంది స్కూటీల కొనుగోలుకు మొగ్గు చూపుతారు. అంతేకాకుండా పట్టణాల్లో ఉండే ట్రాఫిక్, ఇరుకు రోడ్లలో స్కూటీలను సులువుగా నడపవచ్చు. అందుకే సిటీ ప్రజలు సైతం స్కూటీలను కొనేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 6 బెస్ట్ స్కూటర్​ల గురించి తెలుసుకుందాం.

1. Honda Dio features
109 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన హోండా డియో స్కూటర్​ లీటర్ పెట్రోల్​కు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. ప్రస్తుతం ఈ వాహనం ఐదు వేరియంట్​లలో అందుబాటులో ఉంది. హోండా డియో మోడల్​ స్కూటీల ఎక్స్​ షోరూం ధర రూ.70,211 - రూ.77,712 ప్రైస్ రేంజ్​లో ఉంటుంది.

2. Honda Activa 6Gfeatures
109 సీసీ ఇంజిన్ కెపాసిటీ కలిగిన హోండా యాక్టివా 6G స్కూటర్​ లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 5.3 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్ ప్రస్తుతం ఐదు వేరియంట్​లలో అందుబాటులో ఉంది. హోండా యాక్టివా మోడల్​ స్కూటీల ఎక్స్ షోరూమ్ ధర రూ.76,234 - రూ.82,734 వరకు ఉంటుంది.

3. TVS Jupiterfeatures
109 సీసీ ఇంజన్ కలిగిన టీవీఎస్ జూపిటర్ ఎక్స్​ షోరూం ధర రూ.76,753 నుంచి రూ.91,808 వరకు ఉంటుంది. లీటర్​ పెట్రోల్​కు ఈ వెహికిల్ 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ట్యాంక్ కెపాసిటీ 6 లీటర్లు. ప్రస్తుతం ఇది ఆరు వేరియంట్​లలో అందుబాటులో ఉంది.

4. Honda Activa 125features
హోండా యాక్టివా 125 సీసీ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.79806 - రూ.88,979 ఉంటుంది. ఇది లీటరు పెట్రోల్​కు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. ప్రస్తుతం 4 వేరియంట్​లలో హోండా యాక్టివా అందుబాటులో ఉంది.

5. Suzuki Access 125features
124 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ స్కూటర్ లీటర్​కు 45 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది ఐదు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వెహికల్ ఐదు వేరియంట్​లలో అందుబాటులో ఉంది.

6. TVS NTORQ 125 features
125 సీసీ గలిగిన ఈ TVS NTORQ స్కూటీ లీటర్​కు 56.23 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ఇంజిన్ కెపాసిటి 5.8 లీటర్లు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.86,336 - రూ.1.07 లక్షలు ఉంటుంది. ప్రస్తుతం ఈ వెహికల్ ఆరు వేరియంట్​లలో అందుబాటులో ఉంది.

మంచిగా బైక్​ మెయింటెనెన్స్ చేయాలా? ఈ టాప్-10 టిప్స్​ మీ కోసమే!

త్వరలో మార్కెట్​లోకి రానున్న బెస్ట్​ ఈవీ స్కూటర్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details