Best Scooters Under 1 Lakh : ప్రస్తుతం భారతదేశంలో స్కూటీలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నా, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరైనా చాలా సులువుగా డ్రైవ్ చేయడానికి స్కూటీలు అనుగుణంగా ఉండడమే ఇందుకు కారణం. మరి మీరు కూడా మంచి స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ 2025లో రూ.1 లక్ష బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 స్కూటీల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. Suzuki Access 125 : సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఈ 2025లో అప్‌డేటెడ్ సుజుకి యాక్సెస్ 125ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఆటో ఎక్స్‌పో 2025లో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ప్రదర్శించింది. ఈ స్కూటర్ 3 వేరియంట్లలో, 5 రంగుల్లో లభిస్తోంది.
- ఇంజిన్ : 124 సీసీ
- పవర్ : 8.42 పీసీ
- టార్క్ : 10.2 ఎన్‌ఎం
- మైలేజ్ : 45 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 106 కేజీ
- బ్రేక్స్ : డ్రమ్
Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర రూ.83,993 - రూ.95,591 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
2. TVS Jupiter 125 : ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్‌లోని బెస్ట్ స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ 125 ఒకటి. అంతేకాదు టీవీఎస్ కంపెనీ భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 దీని సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా ప్రదర్శించింది. ఈ స్కూటీ 3 వేరియంట్లలో, 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 124.8 సీసీ
- పవర్ : 8.15 పీసీ
- టార్క్ : 10.5 ఎన్‌ఎం
- మైలేజ్ : 57.27 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 108 కేజీ
- బ్రేక్స్ : డ్రమ్/ డిస్క్
TVS Jupiter 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ 125 ధర రూ.81,833 - రూ.93,013 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
3. Honda Activa 6G :ఇండియాలోని మోస్ట్ పాపులర్, హయ్యెస్ట్ సెల్లింగ్ స్కూటర్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. ఇది 3 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 109.51 సీసీ
- పవర్ : 7.84 పీసీ
- టార్క్ : 8.90 ఎన్‌ఎం
- మైలేజ్ : 59.5 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 106 కేజీ
- బ్రేక్స్ : డ్రమ్
Honda Activa 6G Price :మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ ధర రూ.81,286 - రూ.86,286 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
4. Hero Electric Optima :మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీల్లో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఒకటి. ఇది 2 వేరియంట్లలో, 2 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- రేంజ్ : 89 కి.మీ/ఛార్జ్
- బ్యాటరీ కెపాసిటీ : 2 Kwh
- కెర్బ్ వెయిట్ : 93 కేజీ
- టాప్ స్పీడ్ : 48 కి.మీ/గంట
- బ్యాటరీ వారెంటీ : 4 సంవత్సరాలు
- మోటార్ పవర్ : 1.2 కిలోవాట్
Hero Electric Optima Price : మార్కెట్లో ఈ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ధర సుమారుగా రూ.83,300 - రూ.1.04 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది.
5. Yamaha Fascino 125 :యమహా ఫాసినో 125 అనేది నియో-రిట్రో డిజైన్ లాంగ్వేజ్‌తో తీసుకొచ్చారు. ఒక మంచి లైట్‌వెయిట్ స్కూటర్. ఇది 5 వేరియంట్లలో, 9 రంగుల్లో లభిస్తోంది.
- ఇంజిన్ : 125 సీసీ
- పవర్ : 8.2 పీసీ
- టార్క్ : 10.3 ఎన్‌ఎం
- మైలేజ్ : 68.75 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ : 99 కేజీ
- బ్రేక్స్ : డ్రమ్
Yamaha Fascino 125 Price :మార్కెట్లో ఈ యమహా ఫాసినో 125 ధర సుమారుగా రూ.83,730 - రూ.95,400 (ఎక్స్-షోరూం) ఉంటుంది.