Investment Plan For Monthly Income :మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో మదుపు చేసి, నెలనెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందాలని అనుకుంటున్నారా? ఏమాత్రం రిస్క్ తీసుకోవడం మీకు ఇష్టం లేదా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3 ముఖ్యమైన పథకాల గురించి ఆ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. Senior Citizen Savings Scheme : వయోవృద్ధుల కోసం ఈ 'సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్'ను ప్రవేశపెట్టారు. రిస్క్ లేకుండా పక్కాగా ఆదాయం లభించే స్కీమ్‌ల్లో ఇది ఒకటి.
- పథకం : ఇది పెద్దల కోసం ఉద్దేశించిన బెస్ట్ స్కీమ్. దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా మిగతా పథకాలతో పోలిస్తే వడ్డీ కూడా అధికంగా వస్తుంది.
- అర్హత : 60 ఏళ్లు నిండిన వారు ఈ స్కీమ్‌లో మదుపు చేయవచ్చు.
- రాబడి : 8.2% వడ్డీ ఇస్తారు.
- పెట్టుబడి : కనిష్ఠంగా రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.30 లక్షలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
- వడ్డీ చెల్లింపు :ప్రతి మూడు నెలలకోసారి చొప్పున వడ్డీ చెల్లిస్తారు.
- వ్యవధి : 5 ఏళ్లు. ఆ తర్వాత కూడా మూడేళ్లు చొప్పున పొడిగించుకోవచ్చు.
- ఎక్కడ, ఎలా :పోస్టాఫీసు, బ్యాంకు శాఖల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
- పన్ను :మీ మొత్తంఆదాయంలో రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే వచ్చిన వడ్డీకి వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి.
2. Post Office Monthly Income Scheme :ఎలాంటి నష్టభయం లేకుండా, పక్కాగా ఆదాయం చేకూర్చే పథకాల్లో పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఒకటి.
- అర్హత : ఎవరైనా ఇందులో చేరవచ్చు. 10 ఏళ్లకు పైబడిన వారి పేరు మీద సొంత ఖాతానే ఇస్తారు.
- రాబడి : 7.4% వడ్డీ ఇస్తారు.
- పెట్టుబడి : కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షలు; ఉమ్మడిగా రూ.15 లక్షలు వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
- వడ్డీ చెల్లింపు : నెలనెలా వడ్డీ అందిస్తారు.
- వ్యవధి : 5 ఏళ్లు
- ఎక్కడ, ఎలా :మీ దగ్గర్లోని పోస్టాఫీసును సంప్రదించి, ఈ స్కీమ్‌లో చేరవచ్చు.
- పన్ను : వచ్చిన వడ్డీపై వర్తించే శ్లాబులను బట్టి పన్ను వర్తిస్తుంది.