Best Fixed Deposit Schemes In 2024 : వినియోగదారులను ఆకర్షించేందుకు ఇటీవలి కాలంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు లిమిటెడ్-పీరియడ్ 'స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్'లను లాంఛ్ చేశాయి. ఈ స్కీమ్‌ల్లో చేరిన వారికి అధిక వడ్డీ రేట్లను కూడా అందిస్తున్నాయి. ఎలాంటి నష్టభయం లేకుండా, కచ్చితంగా రాబడి ఇచ్చే పథకాల కోసం చూస్తున్నవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
అధిక వడ్డీ రేట్లు అందిస్తున్న టాప్-5 ఎఫ్డీ స్కీమ్స్ ఇవే!
1. SBI Amrit Vrishti Scheme :దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ జులై నెలలో ఒక కొత్త రిటైల్ టెర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించింది. అదే 'అమృత వృష్టి' పథకం. ఇది 444 రోజుల కాల పరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం. దీనిలో మదుపు చేసిన వారికి గరిష్ఠంగా 7.2 శాతం వడ్డీ చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకు అయితే 7.75 శాతం వడ్డీ ఇస్తారు. 2024 జులై 15న ప్రారంభమైన ఈ స్కీమ్ 2024 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ పథకంలో చేరాలని అనుకునేవాళ్లు నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఎఫ్డీ చేయవచ్చు. లేదా యోనో ఎస్బీఐ, యోనో లైట్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారు అత్యవసర పరిస్థితుల్లో ప్రీమెచ్యూర్ విత్డ్రావెల్ కూడా చేసుకోవచ్చు. కానీ దీని కోసం కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
2. Bank Of Baroda Monsoon Dhamaka Scheme :బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ జులై నెలలో 'మాన్సూన్ ధమాకా' పేరుతో ఒక స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించింది.
- 333 రోజుల కాలపరిమితి గల ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ డిపాజిటర్లకు 7.15 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ చెల్లిస్తారు.
- 399 రోజుల కాలపరిమితి గల ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై జనరల్ డిపాజిటర్లకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తారు.
- నాన్-కాలబుల్ (ఎలాంటి లాకిన్ పీరియడ్ లేని) డిపాజిట్లకు 7.40 శాతం వడ్డీ రేటు చెల్లిస్తారు.