తెలంగాణ

telangana

బిజినెస్‌ కోసం వెహికల్ కొనాలా? సాలిడ్‌గా ఉండాలా? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే! - Best Commercial Vehicles In India

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 4:07 PM IST

Best Commercial Vehicles In India : మీరు వ్యాపారులా? రోజువారీ సరకుల రవాణా కోసం వెహికల్ తీసుకుందామని అనుకుంటున్నారా? అలాగే ఆటో రిక్షాను నడిపి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మంచి మైలేజ్, పికప్‌తో మార్కెట్లో ఉన్న టాప్-8 ట్రక్కులు, ఆటో రిక్షాలు ఇవే!

Best Commercial Vehicles In India
Best Commercial Vehicles In India (Getty Images)

Best Commercial Vehicles In India :ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్లు, వాటర్ క్యాన్లు, పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించడం కోసం వ్యాపారులకు వాహనం అవసరం అవుతుంది. అలాగే ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ఆటో రిక్షాలను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో మార్కెట్లో ఉన్న టాప్-8 ట్రక్కు, ఆటో రిక్షాలపై ఓ లుక్కేద్దాం.

1. Tata Ace Gold
టాటా ఏస్ గోల్డ్ చిన్న కమర్షియల్ వాహన శ్రేణిలోని పికప్ ట్రక్. ఇది పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. సరకుల రవాణాకు టాటా ఏస్ గోల్ట్ బెస్ట్ ఆప్షన్‌. ఎందుకంటే దీని క్యాబిన్ పటిష్ఠంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, వాటర్ బాటిళ్లు, పాల క్యాన్లు వంటి సరుకును తీసుకెళ్లేందుకు ఈ ట్రక్కు బాగుంటుంది.

  • టైర్లు : 4
  • కెర్బ్ వెయిట్ : 1510 కేజీలు
  • ఇంజిన్ : 694 సీసీ
  • పేలోడ్ : 710 కేజీలు
  • పవర్ : 24 హెచ్ పీ
  • మైలేజ్ : 15 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ ట్యాంక్ : 26 లీటర్లు
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • ధర : రూ. 3.99 లక్షలు - రూ. 6.69 లక్షలు

2. Mahindra Treo
మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో 2 వేరియంట్లలో లభిస్తుంది. దీన్ని ప్రయాణికుల రవాణా కోసం వాడుకోవచ్చు. అలాగే చిన్నచిన్న సరకులను ఇందులో తీసుకెళ్లవచ్చు. బడ్జెట్‌లో వాహనం కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది.

  • టైర్లు : 3
  • కెర్బ్ వెయిట్ : 350 కేజీలు
  • ఇంజిన్ : 1496 సీసీ
  • పవర్ : 8 kW
  • మైలేజ్ : 15 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ టైప్ : ఎలక్ట్రిక్
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • బాడీ ఆప్షన్ : ఫుల్లీ బిల్ట్
  • ధర : రూ. 2.92 లక్షలు - రూ. 3.02 లక్షలు

3. Mahindra Jeeto
మహీంద్రా జీతో ట్రక్కు వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ వాహనంలో అధిక బరువున్న వస్తువులను తరలించవచ్చు. 12 వాల్ట్ ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఇన్ఫర్మేటివ్ డిజిటలైజ్డ్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఫీచర్లు కలిగి ఉంది. టాటా ఏస్, అశోక్ లేలాండ్ వంటి ట్రక్కులు మార్కెట్లో మహీంద్రా జీతోకు పోటీగా ఉన్నాయి.

  • టైర్లు : 4
  • కెర్బ్ వెయిట్ : 1450 కేజీలు
  • ఇంజిన్ : 1000 సీసీ
  • పేలోడ్ : 715 కేజీలు
  • పవర్ : 17.3 హెచ్ పీ
  • మైలేజ్ : 20-25 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ ట్యాంక్ : 20 లీటర్లు
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • ధర : రూ. 4.30 లక్షలు - రూ. 5.7 లక్షలు

4. Tata Intra V30
బిజినెస్ చేయాలనుకునేవారికి టాటా ఇంట్రా వీ30 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంజిన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ ట్రక్కు పికప్ బాగుంటుంది. పెద్ద పెద్ద లోడులను సైతం ఈ ట్రక్కులో తీసుకెళ్లవచ్చు. ఇందులో లాకబుల్ గ్లోవ్ బాక్స్, డిజిటల్ ఇన్ స్ట్రమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

  • టైర్లు : 4
  • కెర్బ్ వెయిట్ : 2565 కేజీలు
  • ఇంజిన్ : 1496 సీసీ
  • పేలోడ్ : 1300 కేజీలు
  • పవర్ : 69 హెచ్ పీ
  • మైలేజ్ : 14 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ ట్యాంక్ : 35 లీటర్లు
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • ధర : రూ. 7.30 లక్షలు - రూ. 7.62 లక్షలు

5. Bajaj RE
బజాజ్ ఆర్ఈ ప్యాసింజర్ల రవాణా కోసం వాడడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే బడ్జెట్ ధరలో బజాజ్ ఆర్ఈ ఆటో రిక్షాను కొనుగోలు చేయవచ్చు. ఒక లీటరు పెట్రోల్‌కు 40 కి.మీ మైలేజ్ ఇస్తుంది. కాబట్టి ట్యాక్సీలా దీన్ని నడిపించుకోవచ్చు. ఆటో రిక్షా మోడళ్లలో అత్యంత ప్రజాదరణ పొందినవాటిలో ఇదొకటి. మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. ఇందులో నలుగురు ఈజీగా ప్రయాణించవచ్చు.

  • టైర్లు : 3
  • కెర్బ్ వెయిట్ : 673 కేజీలు
  • ఇంజిన్ : 236.2 సీసీ
  • పవర్ : 8 kW
  • మైలేజ్ : 40 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ ట్యాంక్ : 8 లీటర్లు
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • బాడీ ఆప్షన్ : ఫుల్లీ బిల్ట్
  • ధర : రూ. 2.34 లక్షలు - రూ. 2.36 లక్షలు

6. Ashok Leyland Dost Plus
అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ మినీ ట్రక్. ఇది వస్తు రవాణాకు అనుకూలంగా ఉంటుంది. ఈ ట్రక్కులో ఇన్ఫర్మేటివ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మొబైల్ హోల్డర్, ఛార్జర్, వీల్ క్యాప్స్, ఎమర్జెన్సీ లాకింగ్ రిట్రాక్టర్ సీట్‌ బెల్ట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ ట్రక్కు క్యాబిన్ విశాలంగా ఉంటుంది.

  • టైర్లు : 4
  • కెర్బ్ వెయిట్ : 2805 కేజీలు
  • ఇంజిన్ : 1478 సీసీ
  • పేలోడ్ : 1500 కేజీలు
  • పవర్ : 70 హెచ్ పీ
  • మైలేజ్ : 19.6 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ ట్యాంక్ : 40 లీటర్లు
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • ధర : రూ. 7.75 లక్షలు - రూ. 8.25 లక్షలు

7. Tata Ace EV
టాటా ఏస్ ఈవీ భారతదేశపు మొట్టమొదటి ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనం. దీని పికప్ బాగుంటుంది. కనుక లోడ్​తో ఈజీగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్‌ వ్యూ కెమెరా, 7 అంగుళాల ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ట్రక్కు ముందు, వెనుక భాగంలో ఉండే రిజిడ్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ సెటప్‌తో రైడ్‌ను సాఫీగా జరిగేటట్లు చేస్తుంది.

  • టైర్లు : 4
  • కెర్బ్ వెయిట్ : 1840 కేజీలు
  • ఇంజిన్ : 21.3 సీసీ
  • పేలోడ్ : 600 కేజీలు
  • పవర్ : 36 హెచ్ పీ
  • మైలేజ్ : 19.6 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ టైప్ : ఎలక్ట్రిక్
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • బాడీ ఆప్షన్ : బాక్స్ బాడీ కంటైనర్
  • ధర : రూ. 8.72 లక్షలు

8. Tata Intra V50
టాటా ఇంట్రా వీ50 లుక్ బాగుంటుంది. అలాగే అధిక బరువున్న లోడ్‌లను సైతం ఇందులో సులువుగా తీసుకెళ్లవచ్చు. పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాల సంచులు, వాటర్ బాటిళ్లు, పాల డబ్బాలు, గ్యాస్ సిలిండర్లు వంటి వాటిని ఈజీగా రవాణా చేయవచ్చు. లాకబుల్ గ్లవ్ బాక్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లతో ఈ ట్రక్కు అందుబాటులో ఉంది.

  • టైర్లు : 4
  • కెర్బ్ వెయిట్ : 2940 కేజీలు
  • ఇంజిన్ : 1496 సీసీ
  • పేలోడ్ : 1500 కేజీలు
  • పవర్ : 80 హెచ్ పీ
  • మైలేజ్ : 17-22 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ ట్యాంక్ : 35 లీటర్లు
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • బాడీ ఆప్షన్ : బాక్స్ బాడీ కంటైనర్
  • ధర : రూ. 8.67 లక్షలు

ట్యాక్సీ/క్యాబ్ బిజినెస్ చేస్తారా? టాప్-10 కమర్షియల్ కార్స్ ఇవే! - Best Commercial Car In 2024

54 ఫేమస్​ కారు బ్రాండ్లు 14 కంపెనీలవే! ఈ విషయం తెలుసా? - Car Parent Companies Chart 2024

ABOUT THE AUTHOR

...view details