Best Cars Under 10 Lakh :స్టైలిష్ డిజైన్‌తో, స్టన్నింగ్ ఫీచర్స్ ఉన్న కారు కొనాలని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. మరికొందరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు కొనాలని అనుకుంటారు. మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రస్తుతం భారత్‌లో కేవలం రూ.10 లక్షల బడ్జెట్లో టాప్ మోడల్ కార్లు లభిస్తున్నాయి. వాటిలోని టాప్-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Tata Punch :టాటా మోటార్స్ పంచ్ ఎస్‌యూవీని అక్టోబర్ 2021లో లాంఛ్ చేసింది. కస్టమర్లు దీనిని రూ.5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. ప్రస్తుతం రూ.6 లక్షల ధరలో ఎంట్రీ-లెవల్ ప్యూర్ ఎంటీ వేరియంట్ అందుబాటులో ఉంది. టాటా పంచ్ ప్రస్తుతం ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్, క్రియేటివ్ అనే 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ మోడల్ 7 కలర్స్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
2. Tata Nexon :టాటా మోటార్స్ నుంచి వచ్చిన మరో మోడల్ టాటా నెక్సాన్. ఈ కారు ధర రూ.9.74 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. నెక్సాన్ స్మార్ట్, స్మార్ట్+, స్మార్ట్+ S, ప్యూర్, ప్యూర్ S, క్రియేటివ్, క్రియేటివ్+,క్రియేటివ్+ S, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ S, ఫియర్‌లెస్+ S అనే 11 వేరియంట్లలో లభిస్తుంది. 2023 నెక్సాన్ మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనో కైగర్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 , నిస్సాన్ మాగ్నైట్‌లకు ఇది పోటీగా ఉంది.
3. Maruti Brezza :బ్రెజ్జా సబ్-4 మీటర్ ఎస్‍యూవీ. దీనిలో 1.5 లీటర్, 4 సిలిండర్, ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 102 bhp పవర్, 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‍జీ వేరియంట్ 87 bhp పవర్, 121Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో ఇవి వస్తాయి. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌తో పోటీ పడుతున్న మారుతి సుజుకి బ్రెజ్జా ధరలు రూ.8.29 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభమవుతాయి.