Best Bikes Under 2 Lakh :రూ.2 లక్షలలోపు ధరలో మంచి బైక్స్, స్కూటర్స్ కోసం వెతుకుతున్నారా? అయితే మీ కోసం చాలా కంపెనీల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైనవి మేం మీకు పరిచయం చేస్తున్నాం. వీటి స్పెసిఫికేషన్ల ఆధారంగా ఏ బైక్/స్కూటర్ మోడల్ మీ బడ్జెట్‌కు, అవసరాలకు సరితూగుతుందో ఒక అంచనాకు రండి. ప్రత్యేకించి మైలేజీ, ఇంజిన్ కెపాసిటీ వంటి అంశాలను కూడా తప్పకుండా దృష్టిలో ఉంచుకోండి. కొనుగోలుకు సంబంధించిన తుది నిర్ణయానికి వచ్చే ముందు ఇప్పటికే ఆయా ఆటోమొబైల్ కంపెనీల బైక్స్, స్కూటర్స్ నడుపుతున్న వారి ఫీడ్‌బ్యాక్‌ను కూడా తీసుకోవడం బెటర్.
1. KTM 200 Duke : స్టైలిష్ లుక్కు కేటీఎం 200 డ్యూక్ పెట్టింది పేరు. ఆకట్టుకునే సొగసైన రంగుల్లో ఇది లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.1,96,876 ఉంటుంది.
- ఇంజిన్ కెపాసిటీ : 199.5 సీసీ
- స్పెసిఫికేషన్లు : డిస్క్ బ్రేకులు, అలాయ్ వీల్స్
- మైలేజ్ : లీటరుకు 34 కి.మీ
- బరువు : 159 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 13.4 లీటర్లు
- సీటు ఎత్తు : 822 మి.మీ
2. Suzuki Gixxer SF 250 :సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250 అనేది 4 వేరియంట్లు, 3 రంగులలో లభించే స్పోర్ట్స్ బైక్. గిక్సర్ ఎస్ఎఫ్ 250 రేస్ ఎడిషన్ ధర రూ.1,97,773. గిక్సర్ ఎస్ఎఫ్ 250 రైడ్ కనెక్ట్ ధర రూ.2,08,133, గిక్సర్ ఎస్ఎఫ్ 250 రేస్ ఎడిషన్ రైడ్ కనెక్ట్ ధర రూ.2,08,508. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇందులో యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.
- ధర : రూ.1,94,640
- బరువు : 161 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 12 లీటర్లు
- స్పెసిఫికేషన్లు : డిస్క్ బ్రేకులు, అలాయ్ వీల్స్
- ఇంజిన్ కెపాసిటీ : 249 సీసీ
- మైలేజీ - లీటరుకు 35 కి.మీ
- సీటు ఎత్తు : 800 మి.మీ
3. Hero Mavrick 440 :హీరో మావ్రిక్ 440 - ఇప్పటివరకు హీరో కంపెనీ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన మోటార్‌సైకిల్ ఇదే. దీన్ని హార్లే-డేవిడ్సన్ X440 మోడల్ ఆధారంగా రూపొందించారు. బేస్, మిడ్ (రూ.2,14,001), టాప్ (రూ.2,24,001) అనే మూడు వేరియంట్లలో ఇది లభిస్తుంది. ఇది 5 రంగులలో అందుబాటులో ఉంది.
- ధర : రూ.1,99,001 (హీరో మావ్రిక్ 440 - బేస్ వేరియంట్)
- స్పెసిఫికేషన్లు : డిస్క్ బ్రేకులు, స్పోక్ వీల్స్
- ఇంజిన్ కెపాసిటీ : 440 సీసీ
- బరువు : 191 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 13.5 లీటర్లు
- సీటు ఎత్తు : 803 మి.మీ
4. Royal Enfield Classic 350 :రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 క్రూయిజర్ బైక్ 6 వేరియంట్లు, 15 రంగులలో అందుబాటులో ఉంది. క్లాసిక్ 350 రెడిచ్ ధర రూ.1,93,080; క్లాసిక్ 350 హల్క్ యాన్ -సింగిల్ ఛానల్ ఏబీఎస్ ధర రూ.1,95,919; క్లాసిక్ 350 హల్క్ యాన్ -డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధర రూ.2,01,984; క్లాసిక్ 350 క్లాసిక్ సిగ్నల్స్ - డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధర రూ.2,13,852; క్లాసిక్ 350 క్లాసిక్ డార్క్ - డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధర రూ.2,20,991; క్లాసిక్ 350 క్లాసిక్ క్రోమ్ - డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ధర రూ.2,24,755 ఉన్నాయి.
- ఇంజిన్ : 349సీసీ, BS6 స్టాండర్డ్, 27 Nm టార్క్
- బరువు : 195 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 13 లీటర్లు
- మైలేజీ - లీటరుకు 32 కి.మీ
- సీటు ఎత్తు : 805 మి.మీ
- రంగులు : 15 రంగుల్లో లభ్యం
- డిజిటల్ ఫీచర్స్ : యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్లు, గడియారం, ఇంధన గేజ్‌ను చూపే ఎల్సీడీ స్క్రీన్, అనలాగ్ స్పీడోమీటర్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్
5. Yamaha R15 V4 :యమహా R15 V4 అనేది 5 వేరియంట్లు, 7 రంగులలో లభ్యమయ్యే స్పోర్ట్స్ బైక్. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లతో పాటు యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఇది వస్తుంది. వేరియంట్ల వారీగా చూస్తే R15 V4 మెటాలిక్ రెడ్ వేరియంట్ ధర రూ.1,83,155; R15 V4 డార్క్ నైట్ ధర రూ.1,84,155; R15 V4 రేసింగ్ బ్లూ ధర రూ.1,88,155; R15 V4 M ధర రూ.1,97,355; R15 V4 MotoGP ధర రూ.1,98,532 మేర ఉన్నాయి.
- ధర: రూ.1,83,155
- ఇంజిన్ : 155 సీసీ, BS6 ఇంజిన్
- బ్రేక్స్ : ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లు, యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్
- బరువు : 141 కిలోలు
- ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 11 లీటర్లు
- మైలేజీ : లీటరుకు 51.4 కి.మీ
- సీటు ఎత్తు : 815 మి.మీ