Best Bikes Under 1 Lakh :భారత్‌లో బైక్స్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ యువతను ఆకర్షించేందుకు సూపర్ స్టైలిష్ లుక్స్‌తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వాటిలో రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్-10 బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. TVS Raider 125 : మంచి రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్ కావాలనుకునే వారికి టీవీఎస్ రైడర్ 125 మంచి ఆప్షన్ అవుతుంది. దీనిలో 124.8 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 25bhp పవర్ జనరేట్ చేస్తుంది. దీని మైలేజీ 56.7 కి.మీ/లీటర్. మార్కెట్లో ఈ టీవీఎస్ రైడర్ ధర సుమారుగా రూ.97,054 ఉంటుంది.
2. Hero Xtreme 125R :హీరో కంపెనీ రిలీజ్ చేసిన సూపర్ స్టైలిష్ మోడల్ ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్. ఇది మంచి డైనమిక్, స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. దీనిలో 124.7 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ అమర్చారు. ఇది 11.4 bhp పవర్ జనరేట్ చేస్తుంది. దీనిపై లీటర్ పెట్రోల్‌తో 66 కి.మీ ప్రయాణించవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.96,786 ఉంటుంది.
3. Suzuki Burgman Street 125 : ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి టూవీలర్లోనూ మంచి బైక్స్‌ను విడుదల చేస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన సూపర్ స్పోర్ట్స్ స్కూటీ సుజుకి బర్గ్‌మ్యాన్ 125. ఈ ఛార్మింగ్ స్కూటీలో 124 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీని మైలేజ్ 58.5 km/l. ఇది 13 రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.96,524 ఉంటుంది.
4. Suzuki Avenis 125 : కాలేజీ, ఆఫీసుకు వెళ్లేవారికి సుజుకి అవెనిస్ 125 మంచి ఆప్షన్ అవుతుంది. ఈ స్కూటీలోలో 124.3 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 8.58 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటీ మైలేజ్ 49.6 కి.మీ/లీటర్. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.94,503 ఉంటుంది.
5. Benling Aura :క్యూట్ లుక్స్‌తో ఉండే బెన్లింగ్ ఆరా ఎలక్ట్రిక్ స్కూటీ కాలేజీ, ఆఫీస్, ఇంటి అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కూటీపై గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.91,667 ఉంటుంది.
6. Kinetic Green Zulu : స్టైలిష్ లుక్స్‌తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటీల్లో కైనెటిక్ గ్రీన్ జులు ఒకటి. ఇది 2000 W పవర్ జనరేట్ చేస్తుంది. దీని రేంజ్ 104 కి.మీ. టెలిస్కోపిక్ ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ వెనుక సస్పెన్ష్తో వస్తున్న ఈ స్కూటీ ధర మార్కెట్లో సుమారుగా రూ.94,990 ఉంటుంది.
7. TVS Ntorq 125 : మంచి రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్, అత్యుత్తమ ఫీచర్స్, సూపర్ స్పోర్ట్స్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది టీవీఎస్ ఎన్‌టార్క్ 125. ఈ స్పోర్ట్స్ స్కూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీనిలో 124.8 సీసీ ఇంజిన్ ఉంది. ఈ బైక్ మైలేజ్ 41 కి.మీ/లీటర్. ఈ స్కూటీలో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను పొందుపరిచారు. దీని ద్వారా వివిధ బైక్ ఫంక్షన్లను యాక్సెస్ చేయొచ్చు. ఇందులో లోకేషన్ సర్వీసెస్, కాల్ నోటిఫికేషన్స్ వంటి 20 రకాల కమాండ్స్ ఉన్నాయి. రైడింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్‌కు బ్లూటూత్ లేదా వైర్ ఇయర్‌ఫోన్స్ కనెక్ట్ చేసి కమాండ్స్‌తో స్కూటీ సిస్టమ్‌ను ఆపరేట్ చేయొచ్చు. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.87,133 ఉంటుంది.
8. Yamaha Ray ZR 125 : యమహా కంపెనీ విడుదల చేసిన పవర్ఫుల్ స్కూటీ ఈ యమహా రే జెడ్ఆర్125. ఇందులో 125 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. దీనిపై లీటర్ పెట్రోల్‌తో 49 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇది స్టైలిష్ లుక్స్‌తో, రైడింగ్ చేయడానికి మంచి కంఫర్ట్‌గా ఉంటుంది. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.87,079 ఉంటుంది.
9. Honda Dio 125 :హోండా రిలీజ్ చేసిన స్పోర్ట్స్ స్కూటీ హోండా డియో 125 యూత్‌ను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ బైక్‌లో 123.92 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 8.14 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఈ హోండా స్కూటీ మైలేజ్ 48kmpl. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.86,147 ఉంటుంది.
10. Hero Super Splendor : హీరో విడుదల చేసిన మరో బడ్జెట్ బైక్ హీరో సూపర్ స్ప్లెండర్. దీనిలో 124.7 cc సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 10.72 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్ స్ప్లెండర్ లీటర్‌కు 55 కి.మీ మైలేజ్ ఇస్తుంది. మంచి బడ్జెట్ బైక్ కొనాలని అనుకునేవారికి ఈ సూపర్ స్ప్లెండర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.80,759 ఉంటుంది.
స్టన్నింగ్ ఫీచర్స్‌తో టయోటా టైజర్ లాంఛ్ - ధర ఎంతంటే? - Toyota Taisor Launch
బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్-5 మోడల్స్ ఇవే! - Best Mileage Cars In India 2024