Benefits of Joint Account on the Occasion of Valentines Day:నేడు ప్రేమికులు ఎంతో ఇష్టంగా జరుపుకునే వాలెంటైన్స్ డే. ఈ రోజున తాము ప్రేమించే వారిని స్పెషల్‌గా కలుసుకోవాలని, వారికి గిఫ్ట్స్, సర్ప్రైజ్ ఇవ్వాలని భావిస్తుంటారు. ఇందుకోసం ఎన్నో ప్లాన్స్ వేస్తారు. అయితే.. ఈ వాలెంటైన్స్ డేకి సరికొత్త ప్లాన్ వేయండి. జీవితంలో ప్రేమ ఎంత అవసరమో, డబ్బు కూడా అంతే అవసరం. కాబట్టి.. ప్రేమికులిద్దరూ కలిసి బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయండి. దానివల్ల భవిష్యత్తు గురించిన ఆలోచన, భద్రత కోసం చేయాల్సిన పొదుపు వంటి అంశాల పట్ల అవగాహన పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మరి.. ఈ అకౌంట్ వల్ల ప్రయోజనాలు ఏంటి? ఏఏ బ్యాంకులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
జాయింట్ అకౌంట్ అంటే ఏమిటి? ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సంయుక్తంగా కలిగి ఉండే బ్యాంకు అకౌంట్‌ను జాయింట్ అకౌంట్ అని పేర్కొంటారు. సాధారణంగా కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, వ్యాపార భాగస్వాములు ఈ అకౌంట్‌ను కలిగి ఉంటారు. ఇకపోతే పొదుపు ఖాతాలను అందించే అన్ని బ్యాంకులు, ఉమ్మడి ఖాతాను తెరవడానికి అనుమతిస్తాయి.
దంపతుల కోసం బెస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ - ఏకంగా రూ.5.55 లక్షల వడ్డీ!
ఉమ్మడి పొదుపు ఖాతా ప్రయోజనాలు:
- జాయింట్ అకౌంట్ హోల్డర్లు సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
- ఇద్దరూ అకౌంట్లోని డబ్బుకు యాక్సెస్ కలిగి ఉంటారు.
- జాయింట్ ఖాతాలు సాధారణంగా పర్సనల్ అకౌంట్ కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. డబ్బు ఆదా చేయడానికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.
- ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి అనుకూలమైన మార్గాలను బ్యాంకులు అందిస్తాయి.
- ఉమ్మడి పెట్టుబడులు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు కూడా జాయింట్ ఖాతాలను ఉపయోగించవచ్చు.
- చాలా బ్యాంకులు డెబిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లు వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయి.