Bank Holidays In September 2024 :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
2024 సెప్టెంబర్ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays in September 2024 - BANK HOLIDAYS IN SEPTEMBER 2024
Bank Holidays In September 2024 : బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. 2024 సెప్టెంబర్ నెలలో ఏకంగా 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్ పనులు ఏమైనా ఉంటే, ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకుంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడెప్పుడు బ్యాంక్‌లకు సెలవులు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Published : Aug 30, 2024, 10:46 AM IST
List Of Bank Holidays In September 2024
2024 సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!
- సెప్టెంబర్ 1 (ఆదివారం) :
- సెప్టెంబర్ 4 (బుధవారం) : శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి పర్వదినం సందర్భంగా అసోంలోని బ్యాంకులకు సెలవు.
- సెప్టెంబర్ 7 (శనివారం) : వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
- సెప్టెంబర్ 8 (ఆదివారం) :కర్మ పూజ/మొదటి ఓనం సందర్భంగా కేరళ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
- సెప్టెంబర్ 14 (రెండో శనివారం) :
- సెప్టెంబర్ 15 (ఆదివారం) :
- సెప్టెంబర్ 16 (సోమవారం) : మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
- సెప్టెంబర్ 17 (మంగళవారం) :ఇంద్రజాత్ర/ఈద్-ఎ-మిలాద్ (మిలాద్-ఉన్-నబీ) సందర్భంగా సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లలోని బ్యాంకులకు సెలవు.
- సెప్టెంబర్ 18 (బుధవారం) :పాంగ్-లాబ్సోల్ సందర్భంగా అసోంలోని బ్యాంకులకు సెలవు.
- సెప్టెంబర్ 20 (శుక్రవారం) : ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తరువాతి శుక్రవారం సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- సెప్టెంబర్ 21 (శనివారం) :శ్రీ నారాయణ గురు సమాధి దినం సందర్భంగా కేరళలోని బ్యాంకులు పనిచేయవు.
- సెప్టెంబర్ 22 (ఆదివారం) :
- సెప్టెంబర్ 23 (సోమవారం) : మహారాజా హరిసింగ్ పుట్టినరోజు సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లోని బ్యాంకులు పనిచేయవు.
- సెప్టెంబర్ 28 ( నాల్గో శనివారం) :
- సెప్టెంబర్ 29 (ఆదివారం) :
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays :సెప్టెంబర్ నెలలో 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్‌లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.