తెలంగాణ

telangana

ETV Bharat / business

2024 ఆగస్టు నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In August 2024 - BANK HOLIDAYS IN AUGUST 2024

Bank Holidays In August 2024 : బ్యాంక్​ కస్టమర్లకు ముఖ్య గమనిక​. 2024 ఆగస్టు​​​ నెలలో ఏకంగా 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్ ఖాతాదారులు ఇప్పటి నుంచే తమ ఆర్థిక లావాదేవీల షెడ్యూల్​ను పక్కాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడెప్పుడు బ్యాంక్​లకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Holidays in India
Bank Holidays In August 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 2:52 PM IST

Bank Holidays In August 2024 :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) 2024 ఆగస్టు నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 13 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది.

List Of Bank Holidays In August 2024
2024 ఆగస్టు​​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే!

  • ఆగస్టు 4 (ఆదివారం) :దేశంలోని అన్ని బ్యాంకలకు సెలవు. కేరళలో కర్కిడక వావుబలి పండుగ కూడా ఇవాళే జరుపుకుంటారు.
  • ఆగస్టు 7 (బుధవారం) : హరియాలీ తీజ్ పండుగ​ సందర్భంగా హరియాణాలోని బ్యాంకులకు సెలవు.
  • ఆగస్టు 8 (గురువారం) : 'టెండాంగ్ లో రమ్​ ఫాత్' ఉత్సవం సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
  • ఆగస్టు 10 (రెండో శనివారం) :
  • ఆగస్టు 11 (ఆదివారం) :
  • ఆగస్టు 13 (మంగళవారం) :దేశభక్తుల దినోత్సవం సందర్భంగా మణిపుర్​లోని బ్యాంకులకు సెలవు.
  • ఆగస్టు 15 (గురువారం) : భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఆగస్టు 16 (శుక్రవారం) : 'డి జ్యూర్ ట్రాన్స్​ఫర్​ డే' సందర్భంగా పుదుచ్చేరిలోని బ్యాంకులకు సెలవు.
  • ఆగస్టు 18 (ఆదివారం) :
  • ఆగస్టు 19 (సోమవారం) : రక్షా బంధన్​ (రాఖీ పండుగ) సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జులన్​ పూర్ణిమ సందర్భంగా ఒడిశాలోని బ్యాంకులకు సెలవు.
  • ఆగస్టు 24 (నాలుగో శనివారం) :
  • ఆగస్టు 25 (ఆదివారం) :
  • ఆగస్టు 26 (సోమవారం) :శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : ఆగస్టు ​నెలలో 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్​లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.

ఆగస్టు 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ - పెరిగిన ఛార్జీలు, ఫీజుల వివరాలు ఇవే! - HDFC Bank Credit Card Rules

ఆగస్టులో లాంఛ్ కానున్న టాప్​-8 కార్స్ ఇవే! ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతో తెలుసా? - Cars Launching In August 2024

ABOUT THE AUTHOR

...view details