తెలంగాణ

telangana

ETV Bharat / business

భూమి, ఇళ్లు, కార్ల ఈ-ఆక్షన్ కోసం ప్రభుత్వ వెబ్​సైట్ - లిస్ట్​లో 1.22లక్షల ప్రాపర్టీస్‌- చౌకగా దక్కించుకునే ఛాన్స్! - BAANKNET AUCTION PORTAL

Baanknet పోర్టల్‌ ప్రారంభం - ఇకపై ఫ్లాట్స్‌, ల్యాండ్‌, కార్ ఈ-ఆక్షన్‌లో మీరూ పాల్గొనవచ్చు - తెలుసా?

e-Auction
e-Auction (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2025, 1:12 PM IST

Updated : Jan 5, 2025, 1:41 PM IST

Baanknet Auction Portal :బ్యాంకులు తమ వద్ద రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించని వారి నుంచి ఫ్లాట్లు, ప్లాట్‌లు, ఇళ్లు, వ్యసాయ భూములు, కార్లను స్వాధీనం చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి వాటికి ఆక్షన్‌ నిర్వహించి, తమకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకుంటాయి. వాస్తవానికి ఇలాంటి ఆక్షన్స్‌లో బయ్యర్లు చాలా తక్కువ ధరకే విలువైన భూములు, ఫ్లాట్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ చాలా మందికి బ్యాంకులు నిర్వహించే ఈ ఆక్షన్‌ల గురించి తెలియదు. మరికొందరికి ఆక్షన్స్ గురించి తెలిసినా, వాటి వివరాలు ఎక్కడ చూడాలో తెలియదు. అందుకే ఇలాంటి సమస్యలు అన్నింటికీ చెక్ పెడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల Baanknet పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా నేరుగా మీరు బ్యాంకులు నిర్వహించే ఈ-ఆక్షన్ వివరాలను తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గవర్నమెంట్‌ బ్యాంకులు వేలంపాటకు సిద్ధంగా ఉన్న ఫ్లాట్‌లు, ఇళ్లు, భూములు, వాహనాలు, యంత్రాలు (మెషినరీ), ప్లాంట్స్‌ గురించిన పూర్తి వివరాలను బ్యాంక్‌నెట్ పోర్టల్‌లో పొందుపరుస్తాయి. కనుక ఆసక్తి ఉన్న వాళ్లు పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి, ఈ-ఆక్షన్‌కు వస్తున్న ప్రాపర్టీలను ముందుగానే చూసుకోవచ్చు. ఆ ఆక్షన్‌లో నేరుగా పాల్గొనవచ్చు. ఒక వేళ మీకు ఏదైనా సమస్య ఏర్పడితే, వెంటనే కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి, తగిన సహాయం పొందవచ్చు.

ఏకంగా 1,22,500 ప్రాపర్టీస్‌
ప్రస్తుతం మన దేశంలో ఇళ్లు, ఫ్లాట్లు, వెహికల్స్‌ ఆక్షన్‌ కోసం వేర్వేరు పోర్టల్స్ ఉన్నాయి. దీని వల్ల చాలా తికమక ఏర్పడి, ఎక్కువ మంది ఆక్షన్‌లో పాల్గనలేకపోతున్నారు. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బ్యాంక్‌నెట్‌ పోర్టల్‌ను తీసుకువచ్చారు. ఈ పోర్టల్‌లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 1,22,500 ప్రాపర్టీల వివరాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు బ్యాంకులు ఏవైనా ప్రాపర్టీలను వేలం వేయాలనుకుంటే, కచ్చితంగా న్యూస్‌ పేపర్లలో ప్రకటనలు ఇస్తూ వస్తున్నాయి. అయితే ఇకపై ఇలాంటి ప్రకటనలు బ్యాంక్‌నెట్ పోర్టల్‌లోనూ ఇస్తారు. కనుక ఎక్కువ మంది వేలంపాటలో పాల్గొనే అవకాశం ఏర్పడుతుంది. దీని వల్ల ఓ వైపు బ్యాంకులకు సదరు స్థిరాస్తులపై ఎక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు సాధారణ బయ్యర్లకు ఓపెన్ మార్కెట్లోని ధరల కంటే తక్కువ ధరకే ఆస్తులు, వాహనాలు కొనే అవకాశం లభిస్తుంది. ఈ పోర్టల్‌ నేరుగా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కనుక మోసాలు జరిగే అవకాశం తక్కువ!

నోట్‌ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. స్థిర, చరాస్తుకు సంబంధించిన వేలంపాటల్లో పాల్గొనేటప్పుడు, కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల, స్థిరాస్తి రంగ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఫస్ట్ టైమ్‌ ఇల్లు కొంటున్నారా? ఈ 8 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్‌-5 టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

Last Updated : Jan 5, 2025, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details