తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ కారు అమ్మేస్తున్నారా? FASTag విషయంలో మీరు చేయాల్సింది ఇదే! - FASTag Management During Car Sale - FASTAG MANAGEMENT DURING CAR SALE

FASTag Management During Car Sale : మీ కారును అమ్మేయలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ వాహనాన్ని అమ్మేటప్పుడు ఫాస్టాగ్ విషయంలో కూడా మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

How to handle FASTag when selling car
Selling car FASTag update (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 7:07 PM IST

FASTag Management During Car Sale : ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా మారాయి. టోల్​ గేట్​ల వద్ద గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి తప్పిపోయింది. ముఖ్యంగా నగదు/ చిల్లర సమస్య లేకుండా పోయింది.

ఫాస్టాగ్​కు మీ వెహికల్ రిజిస్ట్రేషన్ వివరాలు, బ్యాంకు అకౌంట్​ వివరాలు లింక్ అయ్యి ఉంటాయి. కనుక ఆటోమెటిక్​గా మీ అకౌంట్​ నుంచి టోల్​ ఫీజు చెల్లింపు జరిగిపోతుంది. పైగా వెంటనే మీకు సదరు పేమెంట్ గురించి మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది. ఒక వేళ మీరు మీ కారును అమ్మేయాలని అనుకుంటే, అప్పుడు ఫాస్టాగ్ విషయంలో మీరు కొన్ని కీలకమైన పనులు చేయాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

FASTag Considerations While Selling Your Vehicle
మీ కారును ఇతరులకు అమ్మేటప్పుడుఫాస్టాగ్​ను కూడా మేనేజ్ చేయాలి. అప్పుడే బయ్యర్​కు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్సాక్షన్​ పూర్తి అవుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిన పనులు ఏమిటంటే?

1. ఫాస్టాగ్​ బ్యాలెన్స్​ ట్రాన్స్​ఫర్​
మీ ఫాస్టాగ్​లో ఏమైనా బ్యాలెన్స్​ ఉంటే, దానిని పూర్తిగా వాడుకోవాలి. లేదా కొత్త ఓనర్​కు ఆ బ్యాలెన్స్​ను బదిలీ (ట్రాన్స్​ఫర్) చేయాలి. ఇందుకోసం మీ ఫాస్టాగ్​ ఇష్యూయర్​ను లేదా కస్టమర్ కేర్​ను సంప్రదించాలి.

2. అప్​డేట్​ వెహికల్ డీటైల్స్​
ఒక వేళ మీరు కొత్త కారు లేదా వాహనం కొనుగోలు చేస్తే, ఫాస్టాగ్​ అకౌంట్​లో ఆ వివరాలను అప్​డేట్​ చేయాలి. అప్పుడే మీకు ఎలాంటి సర్వీస్​ సమస్యలు రాకుండా ఉంటాయి.

3. నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​
మీ నుంచి కారు కొనుగోలు చేసిన బయ్యర్​కు కచ్చితంగా 'నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​' (NOC) ఇవ్వాలి. ఫాస్టాగ్​ విషయంలో ఎలాంటి పెండింగ్​ డ్యూస్, ఆబ్లిగేషన్స్ లేవని దీని ద్వారా మీరు ధ్రువీకరించినట్లు అవుతుంది. పైగా ఇది ఫాస్టాగ్​ ట్రాన్స్​ఫర్​కు ఒక ప్రూఫ్​గా కూడా ఉపయోగపడుతుంది.

4. కీ డాక్యుమెంట్స్​
మీ వద్ద వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్​, ఫాస్టాగ్ రిసీట్​, ఇన్సూరెన్స్ పేపర్స్​, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే, ఫాస్టాగ్​ బ్యాలెన్స్​ను ట్రాన్స్​ఫర్​ చేయడానికి ఇవన్నీ అవసరం.

5. డీయాక్టివేట్​ ఫాస్టాగ్​
మీ కారును అమ్మేసిన తరువాత, దానితో లింకై ఉన్న ఫాస్టాగ్​ను డీయాక్టివేట్ చేయాలి. ఇందుకోసం మీకు ఫాస్టాగ్​ ఇష్యూ చేసిన ఇష్యూయర్​ను సంప్రదించాలి. మీరు కనుక నేషనల్ హైవేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (NHAI) నుంచి ఫాస్టాగ్​ తీసుకుని ఉంటే, కస్టమర్ కేర్ హెల్ప్​లైన్​ నంబర్​ - 1033కి కాల్ చేసి, ఫాస్టాగ్​ను డీయాక్టివేట్​ చేయించుకోవాలి.

భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలా? రిస్క్​ లేని టాప్​-10 స్కీమ్స్​ ఇవే! - Top 10 Risk Free Schemes

సేవింగ్స్ అకౌంట్​ మినిమం బ్యాలెన్స్​ రూల్స్ తెలుసా? ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే? - Savings Account Minimum Balance

ABOUT THE AUTHOR

...view details