Amazon Prime Day Sale 2024 :ప్రస్తుత కాలంలో చాలా మంది జనాలు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి వద్ద నుంచే షాపింగ్, ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు, ఒక్కరోజులోనే డెలివరీలు వంటి సదుపాయాల కారణంగా.. అందరూ ఆన్‌లైన్ షాపింగ్‌కే ఓటేస్తున్నారు. అందుకు తగ్గుట్టుగానే.. ప్రముఖ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఒక సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే పేరుతో సేల్‌ను నిర్వహిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఎప్పుడు ?:అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 20 తేదీన అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. అలాగే జులై 21వ తేదీ వరకు రెండు రోజుల పాటు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్‌లో మీరు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే డీల్‌లో ఎవరు షాపింగ్ చేయొచ్చు ?:అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్‌లను అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ లేకపోతే, సేల్‌లో షాపింగ్ చేయడం కుదరదు.
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఎలా పొందాలి ?
- ముందుగా మీ అమెజాన్ అకౌంట్‌లోకి లాగిన్ చేసి.. జాయిన్ ప్రైమ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత నాలుగు ప్లాన్‌లలో మీకు నచ్చిన ప్లాన్‌ను ఎంపిక చేసుకుని.. పేమెంట్ చేయండి. అంతే, ఇలా చేస్తే మీరు ప్రైమ్ డే సేల్‌లో షాపింగ్ చేయవచ్చు.