తెలంగాణ

telangana

ETV Bharat / business

రోజుకు 1.5GB డేటా ప్లాన్- ఎయిర్​టెల్, జియో, వీఐ, బీఎస్​ఎన్​ఎల్​ నెటవర్క్స్​లో ఏది చీప్? - AIRTEL VS BSNL VS JIO VS VI

జియో Vs ఎయిర్​టెల్​ Vs వీఐVs బీఎస్ఎన్ఎల్ ఏ నెట్ వర్క్ బెటర్? తక్కువ ధరకు ఏ నెట్ వర్క్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు?

Airtel Vs BSNL Vs Jio Vs VI Data Plans
Airtel Vs BSNL Vs Jio Vs VI Data Plans (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2024, 7:26 PM IST

Updated : Oct 13, 2024, 7:38 PM IST

Airtel Vs BSNL Vs Jio Vs VI Data Plans : ప్రస్తుతం కాలంలో అందరి చేతిలోనూ మొబైల్ ఫోన్ కామన్ అయిపోయింది. ఈ క్రమంలో ఇంటర్నెట్, కాల్స్ కోసం రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అందుకే ఈ స్టోరీలో నెల, మూడు నెలల కాల వ్యవధితో, రోజుకు 1.5 జీబీ డేటాతో టెలికాం సంస్థలైన జియో, వీఐ, ఎయిర్​టెల్, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రిఛార్జ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.

జియో
జియో రూ.319 ప్లాన్ ​ను రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 మెసేజ్​లను ఉచితంగా పంపించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

అలాగే రూ.889 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు అన్ లిమిటెట్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సావన్ ప్రోకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

వీఐ
వీఐ రూ.349 రీఛార్జ్ ప్లాన్ తో 28రోజులపాటు అన్ లిమిటెట్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటాను పొందొచ్చు. అలాగే 100 మెసేజ్ లను ఉచితంగా పంపించొచ్చు. ప్రతిరోజు రాత్రి 12 నుంచి ఉదయం 6లోపు అన్ లిమిటెడ్ గా డేటాను వాడుకోవచ్చు. సోమ- శుక్రవారం మధ్య మిగిలిన డేటాను వీకెంట్ డేస్ శని, ఆది వారాల్లో యూజ్ చేసుకోవచ్చు. ప్రతినెలా 2జీబీ బ్యాకప్ డేటా ఫ్రీగా వస్తుంది. రూ.859 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే 84రోజుల వ్యాలిడిటీతో ఇవే ప్రయోజనాలను పొందొచ్చు.

ఎయిర్​టెల్
ఎయిర్​టెల్ రూ.349 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అలాగే 100 మెసేజ్ లు ఫ్రీ. అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్ యాప్ లో నెలకు 1 ఫ్రీ హలోట్యూన్, స్పామ్ కాల్ లేదా మెసేజ్ వస్తే మొబైల్ కు అలర్ట్ వంటి ప్రయోజనాలను పొందొచ్చు. రూ.799 ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. 28రోజుల ప్లాన్ కు ఉన్న సదుపాయాలే దీనికి ఉన్నాయి.

బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్ రూ.187ప్లాన్ తో 28 రోజుల వ్యాలిడిటీతో అన్​లిమిటెట్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 మెసేజులు ఉచితం. రోజువారి లిమిట్ డేటా అయిన తర్వాత 40కేబీపీఎస్​తో అన్​లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. ఈ రీఛార్జి ప్లాన్​లో BSNL ట్యూన్స్‌, హర్డీ గేమ్స్‌ తరహా సదుపాయాలు ఉంటాయి. రూ.485 రీఛార్జ్​తో 80 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 2జీబీ డేటా వాడుకోవచ్చు.

Last Updated : Oct 13, 2024, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details