తెలంగాణ

telangana

ETV Bharat / bharat

20ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం- ప్రైవేట్​ పార్ట్స్​లో సర్జరీ బ్లేడ్, రాళ్లు చొప్పించి! - MUMBAI AUTO DRIVER RAPE CASE

ముంబయిలో దారుణం- యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

Mumbai Rickshaw Rape Case
Mumbai Rickshaw Rape Case (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2025, 1:13 PM IST

Mumbai Auto Driver Rape Case :20 ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాలడ్డాడు. అనంతరం ఆమె ప్రైవేట్ భాగాల్లో సర్జరీ బ్లేడ్, చిన్నచిన్న రాళ్లను చొప్పించాడు. ఈ దారుణం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగింది. ఈ ఘటనలో నిందితుడు రాజరతన్ వల్వాల్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం--తన వాహనం ఎక్కిన బాధితురాలిపై గురువారం ఆటోరిక్షా డ్రైవర్ రాజ్ రతన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమె ప్రైవేట్ భాగాల్లో రాళ్లు, సర్జరీ బ్లేడ్ ను చొప్పించాడు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గురువారం అర్ధరాత్రి రామ్ మందిర్ స్టేషన్ సమీపంలో విడిచిపెట్టేసి పరారయ్యాడు. బాధితురాలు ఏడుస్తూ కనిపించడం వల్ల స్థానికులు వాన్రాయి పోలీసులకు సమాచారం అందించారు.

బాధితురాలికి వైద్య పరీక్షలు
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యం కోసం ముంబయిలోని కేఈఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధరించారు. వసాయ్ బీచ్​లో బాధితురాలిపై నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ అత్యాచార ఘటన కేసుపై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్మితా పాటిల్ దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాజ్ రతన్ వాల్వాల్​ను అదుపులోకి తీసుకున్నామని ఆమె తెలిపారు. అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

సిగరెట్లు అమ్మలేదని 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
మరోవైపు సిగరెట్లు ఇచ్చేందుకు నిరాకరించదని 65 ఏళ్లు వృద్ధురాలపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన బిహార్​లోని లఖీసరాయ్ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం- నవాబ్​జంగ్ ప్రాంతాలో చిన్న దుకాణం నడుపుతున్న 65 ఏళ్లు వృద్దురాలి ఇంటికి బుధవారం(జనవరి 22) అర్ధరాత్రి నలుగురు యువకులు వచ్చారు. సిగరెట్లు ఇవ్వాలని అడిగారు. అందుకు ఆమె నిరాకరించింది. సిగరెట్లు ఇవ్వలేదనే కోపంతో ఆ వృద్ధురాలిని సమీపంలోని పొలాల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి వాంగ్మూలం ఆధారంగా వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్​పీ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details