తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ వారం ఆ రాశుల వారికి ధన లాభం - వాహన యోగం తథ్యం!

Weekly Horoscope From 21st To 27th January 2024 : ఈ 2024 జనవరి 21 నుంచి 27వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in telugu
Horoscope From 21st To 27th January 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 7:01 AM IST

Weekly Horoscope From 21st To 27th January 2024 :2024 జనవరి 21 నుంచి 27వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మేషం (Aries) :ఈ వారం మేష రాశివారికి సాధారణంగా గడుస్తుంది. వారం చివరిలో మంచి వార్త వింటారు. డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యారంగంలో పురోగతి సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు కొత్త కంపెనీలకు మారే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతారు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. దినచర్యలో మార్పులు చేసుకోవడం మంచిది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి.

వృషభం (Taurus) :ఈ వారం వృషభ రాశివారు తమ మనస్సులోని భావాలను ప్రేమికులకు చెబుతారు. అది వారిని చాలా చాలా సంతోషపరుస్తుంది. వైవాహిక జీవితంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ పెద్దల జోక్యంతో అవి సద్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సుఖ దుఃఖాలను పంచుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఉద్యోగులు తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యవహారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. వ్యాపారంలో స్నేహితుల సహకారం మీకు లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే తరువాత ఇబ్బందిపడాల్సి వస్తుంది.

మిథునం (Gemini) :ఈ వారం మిథున రాశివారి కుటుంబ జీవితం బాాగానే ఉంటుంది. కానీ బయటి వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలి. ఖర్చులు పెరుగుతాయి. పైగా ఆదాయం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్​లో మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యం క్షీణించవచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలి. వ్యాపార భాగస్వాములతో కలిసి చేసే వ్యవహారాల వల్ల మంచి లాభాలు సంపాదిస్తారు.

కర్కాటకం (Cancer) : ఈ వారం కర్కాటక రాశివారి ప్రేమ జీవితం సుఖంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో మాత్రం ఒడుదొడుకులు ఏర్పడవచ్చు. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. వ్యాపారంలో కొత్త పద్ధతులను అనుసరించి, విజయం సాధిస్తారు. కానీ ప్రమాదకరమైన పెట్టుబడుల జోలికి వెళ్లకూడదు. పిల్లల భవిష్యత్​ కోసం పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు సాంకేతిక విద్యల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యుల మద్ధతు మీకు లభిస్తుంది. ఏదైనా విజయం సాధించాలంటే, కచ్చితంగా బాగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. స్నేహితులు మీకు అండగా ఉంటారు. వారి వల్ల ఆర్థికంగానూ లాభపడతారు. ఇంటి మరమ్మత్తులకు, అలంకరణకు బాగా డబ్బులు ఖర్చు చేస్తారు.

సింహం (Leo) :ఈ వారం సింహ రాశివారి ప్రేమ బంధాలు చాలా మాధుర్యంగా ఉంటాయి. ఒకరికొకరు అనేలా ఉంటారు. కానీ వివాహితుల జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. పెట్టుబడుల విషయంలో కచ్చితంగా ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. శ్రామికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి కలగవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి చేసి, ఆదాయాన్ని పొందుతారు. సోదరుల వివాహానికి వచ్చిన అడ్డంకులు తొలుగుతాయి. కుటుంబ సభ్యుల, పిల్లల మద్ధతు మీకు లభిస్తుంది. యాత్రలకు వెళ్లే సూచనలు ఉన్నాయి.

కన్య (Virgo) : ఈ వారం కన్య రాశివారి గృహజీవితం శాంతియుతంగా, సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. ప్రేమికులు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు తమ పనిలో బాగా రాణిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల నుంచి వస్తున్న వ్యాపారంలో కొన్ని కీలక మార్పులు చేస్తారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుతారు. పోటీల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల కోసం బాగా డబ్బులు ఖర్చు చేస్తారు.

తుల (Libra) :ఈ వారం తుల రాశివారు తమ మనస్సులోని భావాలను ప్రియమైనవారికి తెలియజేస్తారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్ధతు పొందుతారు. వ్యాపారంలో కొత్త మార్పులు చేస్తారు. వ్యాపార భాగస్వామి వలన ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు తమ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పైఅధికారుల సహకారం మీకు లభిస్తుంది. డబ్బులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్య పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. విద్యార్థులు చదువుల కోసం స్వస్థలం నుంచి నగరాలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. తండ్రికి సంబంధించిన ఆస్తులు పొందుతారు. మీ అభిరుచుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు.

వృశ్చికం (Scorpio) :ఈ వారం వృశ్చిక రాశివారికి చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. ప్రేమ బంధం బలపడుతుంది. వివాహితులు సుఖంగా జీవిస్తారు. బాగా డబ్బులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మానసిక సంతృప్తి కలుగుతుంది. కానీ వ్యాపారంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రతతో చదువుతారు. పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. ఆరోగ్యం ఫర్వాలేదు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి మరమ్మతులు, అలంకరణలు చేస్తారు.

ధనుస్సు (Sagittarius) : ఈ వారం ధనుస్సు రాశివారి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆదాయం మాత్రం కాస్త అటుఇటుగా ఉంటుంది. కానీ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. ముందస్తు ప్రణాళికతో పనిచేస్తేనే, మీకు లబ్ధి చేకూరుతుంది. లేదంటే కష్టమే. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగులు మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాగా కష్టపడి చదివితేగానీ, పోటీ పరీక్షల్లో నెగ్గడం కష్టం. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

మకరం (Capricorn) :ఈ వారం మకర రాశివారికి బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమికులకు మాత్రం కాస్త కష్టంగానే ఉంటుంది. మీరు విలువైన ఆస్తులు కొంటారు. ఇవి భవిష్యత్​లో మంచి రాబడులను ఇస్తాయి. మీ తండ్రిగారి వల్ల ఆర్థికంగా బాగా లాభపడతారు. అన్నదమ్ములు మీకు సహాయంగా ఉంటారు. ఉద్యోగులు తమ పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం పట్టణాలకు వెళతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితుల నుంచి మంచి శుభవార్త వింటారు. మీ బిడ్డకు ఉద్యోగ అవకాశం వస్తుంది. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

కుంభం (Aquarius) :ఈ వారం కుంభ రాశివారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మద్ధతు మీకు లభిస్తుంది. సోదరుడి వివాహ ప్రతిపాదన సఫలం అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో లాభాలు సంపాదిస్తారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. కానీ సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బందిపెడతారు. విద్యా రంగంలో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేయాలని భావిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

మీనం (Pisces) :ఈ వారం మీన రాశివారి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది. తండ్రి నుంచి ఆస్తులు లభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆరోగ్యం మునుపటి కంటే బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నిలిచిపోయిన వ్యాపార ప్రణాళికలను మరలా అమలు చేస్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల నుంచి మద్ధతు లభిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details