కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 123కు చేరింది.
కేరళలో డెడ్లీ ల్యాండ్‌స్లైడ్- 123మంది మృతి- రంగంలోకి సైన్యం - Wayanad Landslide - WAYANAD LANDSLIDE
Published : Jul 30, 2024, 10:42 AM IST
|Updated : Jul 30, 2024, 10:42 PM IST
- Wayanad Landslides Live Updates: కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో ఈ తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అనేక మంది మృతి చెందారు. మరెంతో మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం KSDMA, అగ్నిమాపక బృందం, NDRF బృందాలు, ఆర్మీ, నేవీ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
LIVE FEED
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 120కు చేరింది.
- కేరళ: కొండచరియలు విరిగిపడిన ఘటనలో 107కు చేరిన మృతులు
- కేరళ: మరో 128 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం
- కేరళ: వయనాడ్ జిల్లాలో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు
- కేరళ: వయనాడ్ జిల్లాలో కొనసాగుతున్న సహాయ చర్యలు
- కేరళ: కొండచరియలు విరిగిపడిన ఘటనలో 93కు చేరిన మృతులు
- కేరళ: మరో 116 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం
- కేరళ: వయనాడ్ జిల్లాలో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు
- కేరళ: వయనాడ్ జిల్లాలో కొనసాగుతున్న సహాయ చర్యలు
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 84కు చేరింది. మరో 116 మంది గాయపడినట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి కార్యాలయం వెల్లడించింది.
కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 80మందికి పైగా మృతదేహాలను వెలికితీసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. మరో 116 మందికి పైగా గాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు.
కేరళ: కొండచరియలు విరిగిపడిన ఘటనలో 73కు చేరిన మృతుల సంఖ్య
కేరళ: మరో 116 మందికి పైగా గాయాలు, కొందరి పరిస్థితి విషమం
కేరళ: వయనాడ్ జిల్లాలో వేర్వేరుచోట్ల విరిగిపడిన కొండచరియలు
వయనాడ్ జిల్లాలో సహాయచర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్, సైనిక సిబ్బంది
చురల్మలలో మరోసారి కొండచరియలు విరిగిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు చేపట్టిన ప్రాంతం సమీపంలో పెద్ద శబ్దం వచ్చినట్లు సమాచారం. దీంతో రెస్క్యూ బృందం సురక్షిత ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
- మెప్పాడి ఆస్పత్రిలో 42 మృతదేహాలు
- అందులో 35 మృతదేహాలు గుర్తించినట్లు సమాచారం
- గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
- రానున్న ఐదు రోజుల పాటు వాయనాడ్‌లో వర్షాలు : వాతావరణ శాఖ
- 60మందికి చేరిన మృతుల సంఖ్య
- వయనాడ్‌కు వెళ్లిన కేంద్ర మంత్రి జార్జ్ కురియన్
- సహాయక చర్యలను సమన్వయం చేసిన కేంద్ర మంత్రి
- వయనాడ్‌లో పరిస్థితిపై కేరళ సీఎంకు తమిళనాడు సీఎం ఫోన్
- రూ.5 కోట్లు అసిస్టెన్స్ ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్
- రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేసేందుకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను నిమించిన తమిళనాడు ప్రభుత్వం
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 54కు చేరింది.
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 54కు చేరింది. ఆ రాష్ట్ర మంత్రి శశీంద్రన్ ఈ విషయం వెల్లడించారు.
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది.
రంగంలోకి నేవీ
వయనాడ్ జిల్లాలో సహాయక చర్యలు వేగవంతం చేయడానికి నేవీ బృందం రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎజిమల నేవల్ అకాడమీ నుంచి నేవీ రివర్ క్రాసింగ్ బృందం వయనాడ్‌కు చేస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
- రాజ్యసభలో వయనాడ్ ఘటనపై మాట్లాడిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా
- కేరళ మాత్రమే కాదు దేశం మొత్తం ఆందోళన చెందుతోంది : జేపీ నడ్డా
- కేంద్ర ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి: జేపీ నడ్డా
వయనాడ్ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించి చురల్‌మల వద్ద కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
- డిప్యూటీ కలెక్టర్- 8547616025
- తహసీల్దార్ వైతిరి - 8547616601
- కల్పత్త జాయింట్ BDO ఆఫీస్ - 9961289892
- అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ - 9383405093
- అగ్నిమాపక దళం అసిస్టెంట్ స్టేషన్ ఆఫీసర్ - 9497920271
- వైతిరి తాలూకా కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ - 9447350688
వయనాడ్ జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్ 04 BN కంట్రోల్ రూమ్, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. కేరళ SEOC, వాయనాడ్ జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పింది.
- 43కు చేరిన మృతుల సంఖ్య
- సీఎం సూచనల మేరకు రంగంలోకి డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు
- సహాయ చర్యల్లో ఆర్మీ ఇంజినీరింగ్ బృందం
- బెంగళూరు, చెన్నై నుంచి రానున్న ఇంజినీరింగ్ బృందం
- చురల్మల వద్దనున్న ఏకైక వంతెన కూలిపోవడం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
మెప్పాడి ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న వారిని పరామర్శించిన కేరళ మంత్రి ఎకే ససీంద్రన్
- ఆర్మీ చీఫ్‌తో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- వాయనాడ్‌లో సహాయం కోసం బలగాలను సమీకరించాలని కోరిన రాజ్‌నాథ్
- ఘటనాస్థలికి చేరుకుంటున్న ఆర్మీ బృందాలు
కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 101 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ రెండో బృందం రాబోతోందని తెలిపారు.
- కేరళ: కొండచరియలు విరిగిపడిన ఘటనలో 24కు చేరిన మృతులు
- కేరళ: మరో 70 మందికి పైగా గాయాలు, ఆస్పత్రులకు తరలింపు
- సహాయచర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్, నౌకాదళం, వైమానిక దళ సిబ్బంది
- వయనాడ్ జిల్లాలో సహాయ చర్యలు చేపట్టిన 225 మంది సైనిక సిబ్బంది
రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శిథిలాల కింద చిక్కుకొన్నవారిని త్వరలోనే సురక్షితంగా బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగ్రాతులకు రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
- కేరళలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
- పతనంతిట్ట, అలాప్పుజ, కొట్టాయం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
- ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
సహాయక చర్యలు వేగవంతం చేయడం కోసం 225 మంది ఆర్మీ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు, రాష్ట్రంలో పరిస్థితి దృష్ట్యా ఆర్మీ సహాయం కోరింది కేరళ ప్రభుత్వం. దీనిపై స్పందించిన ఆర్మీ, 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (టిఎ) మద్రాస్ నుండి సెకండ్-ఇన్-కమాండ్ నేతృత్వంలోని 43 మంది సిబ్బందితో కూడిన బృందాన్ని ఘటనాస్థలికి పంపింది. అంతేకాకుండా ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు (JCO), 40 మంది సైనికులతో కూడిన బృందం సహాయక చర్యల కోసం సిద్ధమైంది.