తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రైన్ టికెట్ బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్​ అని వచ్చిందా? - ఇలా చేశారంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు! - Waiting List Tickets Confirm Tricks - WAITING LIST TICKETS CONFIRM TRICKS

Waiting List Tickets Confirm Tricks : మీరు ఎక్కడికైనా వెళ్లాలని ట్రైన్ జర్నీ ప్లాన్ చేస్తున్నారా? టికెట్లు బుక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్ అని వచ్చిందా? అయితే మీరు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. టికెట్ ఏజెంట్లు ఫాలో అయ్యే ఈ ట్రిక్స్​తో పాటు మరికొన్ని సూచనలను పాటించారంటే మీ వెయింటిగ్​ లిస్ట్ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు! అదేలాగో ఇప్పుడు చూద్దాం.

TRAIN TICKET BOOKING
Waiting List Tickets

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 12:29 PM IST

How to Confirm Train Waiting List Tickets :నిత్యం ఎంతో మంది ప్రజలు తమ గమ్యస్థానాన్ని చేరుకోవటానికి రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అందుకు ప్రధాన కారణం.. తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగించడం. అయితే.. పండగ, పెళ్లిళ్ల సీజన్లలో, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రైలు(Train) టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని కొందరు చాలా అడ్వాన్స్​డ్​గా రిజర్వేషన్ చేస్తుంటారు. అయినా, కొన్నిసార్లు ప్రయాణికులు బుక్ చేసిన టికెట్లు కన్ఫార్మ్ కాకపోగా వెయిటింగ్ లిస్ట్ అని వస్తోంది. చాలా సార్లు అవి కన్ఫార్మ్ కాకుండా పోతాయి.

ఇదిలా ఉంటే.. రద్దీ సమయాల్లో కూడా కొందరు టికెట్ బుకింగ్ ఏజెంట్లు మీ ట్రైన్ టికెట్స్ వెయిటింగ్ లిస్ట్​లో లేకుండా కన్ఫార్మ్ అయ్యేలా చేస్తామని చెబుతూ అందుకు రెండు నుంచి మూడు రెట్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. అయితే, ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్​ ఏంటంటే.. IRCTCలో వెయిటింగ్ లిస్ట్​ చూపిస్తున్నప్పటికీ టికెట్ ఎలా​ కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏజెంట్లు కొన్ని ట్రిక్స్​ ఫాలో అవుతారు. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వారు ఉపయోగించే ట్రిక్స్ ఏంటంటే..?పండగల సీజన్, మరికొన్ని రద్దీగా ఉండే సమయాలలో రద్దీగా ఉండే రూట్లలో కొన్ని సీట్లు రెండు నుంచి మూడు నెలల ముందుగానే బుక్‌ అవుతాయి. అలాగే.. 15 నుంచి 45 సంవత్సరాలు మధ్య వయసున్న వారి పేర్లతో ట్రైన్ టికెట్స్ బుక్‌ అవుతాయి. ఎందుకంటే సాధారణంగా 15 నుంచి 45 సంవత్సరాల వయసు గల ప్రయాణికులు రైలులో ఎక్కువగా జర్నీ చేస్తుంటారు.

విహార యాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా? - మీ కోసమే ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - Summer Special Trains

ఈ క్రమంలో బుకింగ్ ఏజెంట్లు ముందుగా బుక్ చేసుకున్న టిక్కెట్లను ప్రయాణికులకు అందజేస్తారు. ఈ సందర్భంలో వారి నుంచి 2-3రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. అయితే, జర్నీ చేసేటప్పుడు TTE (టికెట్ చెకర్) ప్రయాణీకుల పేరు, సీటు నంబర్‌ను అడుగుతుంటారు. కాబట్టి, దీని వల్ల ఏజెంట్లు లబ్ధి పొందుతున్నారట. అదే.. ఒకవేళ టీటీఈలకు అనుమానం వచ్చి ప్రయాణికుల ఐడీ కార్డు గానీ, ఫోన్‌లో వచ్చిన మెసేజ్ గానీ చూస్తే అసలు బాగోతం బయటకు వస్తుంది. ఆ టైమ్​లో మిమ్మల్ని రైల్వే సిబ్బంది కోచ్​ నుంచి బయటకు పంపించవచ్చు. లేదంటే ఫైన్ కట్టమని జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

మీకు వెయిటింగ్ టికెట్ వస్తే ఏం చేయాలంటే?మీరు టికెట్ బుక్ చేశారు కానీ టికెట్ కన్ఫార్మ్ కాలేదు. అలాంటి టైమ్​లో మీరు ఇబ్బందిపడకుండా బుక్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్​లో ఉంటే.. నేరుగా ట్రైన్​లో ఉన్న TTE వద్దకు వెళ్లి మాకు బెర్త్ కన్ఫర్మ్ చేస్తారా అని అడిగి తెలుసుకోవచ్చు. ఆ టైమ్​లో.. మీరు ప్రయాణించే ట్రైన్​లో ఏదైనా బెర్త్ ఖాళీగా ఉంటే అప్పుడు టీటీఈ మీకు దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. లేదంటే.. చివరి నిమిషంలో టికెట్ క్యాన్సల్ చేసే అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

ఆ సమయాల్లో జనరల్​ టికెట్​తో - స్లీపర్ క్లాస్​ బోగీలో ప్రయాణించొచ్చు! - RAILWAY GENERAL TICKET RULES

ABOUT THE AUTHOR

...view details