తెలంగాణ

telangana

రైల్వే ఉద్యోగులకు బోనస్‌, 5భాషలకు ప్రాచీన హోదా- కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలివే! - Cabinet Decisions

Union Cabinet Decisions Today : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది. దేశంలోని మరో ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపింది.

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Published : 4 hours ago

Union Cabinet Decisions Today
Union Cabinet Decisions Today (ANI)

Union Cabinet Decisions Today : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబిల్‌ ఆయిల్‌- ఆయిల్‌ సీడ్స్‌కు ఆమోదం తెలిపింది. దేశంలో మరో ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో మరాఠీ, పాళి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. ఇప్పటికే తెలుగు సహా ఆరు భాషలకు ప్రాచీన హోదా ఉంది.

రైల్వే ఉద్యోగులకు బోనస్‌
పండగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్‌గా రూ.2028.57 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.

మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో దశకు ఆమోదం
చెన్నై మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో దశకు ఆమోద కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ట్రాఫిక్‌ను సులభతరం చేసి, ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫేజ్‌-2లో భాగంగా రూ.63,246 కోట్లతో 119కి.మీల మేర ఈ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద మూడు కారిడార్లుగా మొత్తం 120 స్టేషన్లు నిర్మించనున్నారు.

వంట నూనెలు దేశ వార్షిక అవసరాల్లో 50శాతానికి పైగా భారత్‌ దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంట్లో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2022-23 నాటికి 39 మిలియన్‌ టన్నుల నూనె గింజలను దేశంలో ఉత్పత్తి చేస్తుండగా, 2030-31 నాటికి 69.7 మిలియన్‌ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లు పెంచేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాబోయే ఆరేళ్లలో నూనెగింజల ఉత్పత్తికి రూ.10,103 కోట్లు ఖర్చు చేయనుంది. వంట నూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ABOUT THE AUTHOR

...view details