Tips to Clean Stains on Steel Gates and Railings: ఇంటికి క్లాసీ లుక్‌ను అందించేందుకు చాలా మంది ఇంటీరియర్ నుంచి అవుట్ డోర్ డెకరేషన్ వరకు అనేక పద్ధతులు ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇంటికి రక్షణ అందించే డోర్ విషయంలో, అందాన్నిచ్చే బాల్కనీ విషయంలో స్టీల్ గేట్లు, రెయిలింగ్‌లను ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే.. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా ఈ వర్షాలకు వాటిపై మరకలు ఏర్పడుతుంటాయి. కొన్ని సార్లు తుప్పు పడుతుంటాయి. ఎన్నిసార్లు క్లీన్ చేసినా వాటిపై మరకలు ఓ పట్టాన పోవు. ఇలాంటి పరిస్థితులలో ఈ టిప్స్ పాటించడం వల్ల ఇంటి గేట్, రెయిలింగ్‌పై ఉన్న మరకలను తొలగించి వాటిని కొత్తవాటిలా మెరిపించవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ టిప్స్ ఏంటంటే..
బేకింగ్ సోడా: స్టీల్ రెయిలింగ్‌లు, గేట్లను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం బేకింగ్ సోడాలో కొన్ని నీటిని కలిపి పేస్ట్ లాగా చేసి.. దానిని తలుపు, రెయిలింగ్‌పై అప్లై చేసి కాసేపు వదిలివేసి.. ఆ తర్వాత క్లాత్‌తో తుడిస్తే మరకలు పోతాయని అంటున్నారు.
2019లో 'జర్నల్ ఆఫ్ క్లీనింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. స్టెయిన్‌లెస్ స్టీల్ రెయిలింగ్ ఉపరితలాలపై కఠినమైన మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని నాన్జింగ్ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ డాక్టర్ Y. Zhang పాల్గొన్నారు. బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపరితలాలకు ఎటువంటి నష్టం జరగదని పేర్కొన్నారు.
స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్‌ని ఎలా శుభ్రం చేస్తున్నారు ? - ఇలా చేస్తే జిడ్డు పోయి కొత్తదానిలా!
డిష్ వాషింగ్ లిక్విడ్:స్టీల్ రెయిలింగ్‌లు, గేట్‌లను క్లీన్ చేయడానికి డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం.. డిష్ వాషింగ్ లిక్విడ్ నీటిలో కలిపి మరకలపై స్ప్రే చేసి.. కొద్దిసేపటి తర్వాత తడి క్లాత్‌తో తుడవడం వల్ల.. మరకలన్నీ తొలగిపోయి కొత్తవాటిలా మెరుస్తాయని చెబుతున్నారు.