తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 3:16 PM IST

ETV Bharat / bharat

గుడిలోని ప్రసాదమంత టేస్టీ పులిహోర ఇంట్లోనే! - ఈ చిన్న టిప్స్​ పాటిస్తే అద్భుత రుచిని అస్వాదిస్తారు! - How To Make Temple Style Pulihora

Temple Style Prasadam Pulihora Recipe : చాలా మందికి పులిహోర చేయడం వచ్చు. కానీ.. రుచి దగ్గరికి వచ్చేసరికి ఏదో తగ్గినట్టుగా అనిపిస్తుంది! అయితే.. కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల దేవాలయాల్లో పెట్టే పులిహోర ప్రసాదాన్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Prasadam Pulihora Recipe
Temple Style Prasadam Pulihora Recipe (ETV Bharat)

Temple Style Pulihora :పులిహోర దాదాపుగా అందరికీ ఎంతో ఇష్టం. ఆలయాల్లో ప్రసాదంగా అందించే పులిహోర తిన్నవారు.. మరికాస్త ఉంటే బాగుండు అనుకుంటారు. కానీ.. ఇంట్లో ఎన్నిసార్లు పులిహోర చేసినా కూడా.. అలాంటి టేస్ట్‌ మాత్రం రాదు! మరి టెంపుల్‌ స్టైల్‌ పులిహోరను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో చూద్దాం పదండి..

కావాల్సిన పదార్థాలు :

  • అన్నం- పావుకేజీ
  • చింతపండు- 50 గ్రా.
  • పసుపు- టీస్పూన్‌
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కరివేపాకు రెబ్బలు- రెండు
  • చీల్చిన పచ్చిమిర్చి- మూడు
  • ఆవాలు- రెండు టేబుల్‌స్పూన్లు
  • అల్లం- చిన్నముక్క
  • ఎండుమిర్చి- రెండు
  • బెల్లంపొడి- టీస్పూన్‌

టిఫెన్​ స్పెషల్​ : "రాయలసీమ పల్లీ చట్నీ" - పదే పది నిమిషాల్లో రెడీ!

రెండో తాలింపు కోసం :

వేరుసెనగపప్పు- 1/4 కప్పు, మినప్పప్పు, శనగపప్పు- టేబుల్‌స్పూన్‌ చొప్పున, ఎండుమిర్చి- ఐదు, కరివేపాకు- రెండు రెబ్బలు, ఇంగువ చిటికెడు, బెల్లంపొడి- టేబుల్‌ స్పూన్‌.

పులిహోర తయారీ విధానం :

  • ముందుగా బియ్యాన్ని కడిగి అన్నాన్ని కాస్త పలుగ్గా వండుకోవాలి.
  • తర్వాత చింతపండుని వేడినీళ్లలో నానబెట్టుకోవాలి.
  • అన్నం వేడిగా ఉన్నప్పుడే పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. అలాగే అన్నంలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి.
  • అలాగే కొద్దిగా వేరుసెనగ నూనె లేదా నువ్వుల నూనె పోసి అన్నానికి నూనె పట్టేలా పైపైన కలపాలి.
  • ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో టేబుల్‌ స్పూన్‌ ఆవాలు, అల్లం, ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తని పేస్ట్‌ చేసుకోవాలి.
  • స్టవ్‌ మీద కడాయి పెట్టి ఆయిల్‌ పోసి వేడిచేసి ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి.
  • ఇందులోనే చింతపండు పులుసుపోసి అది చిక్కగా అయ్యేంతవరకు మరిగించాలి.
  • తర్వాత ఈ మిశ్రమంలో బెల్లం పొడి వేసి కలుపుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల పులిహోర మరీ పుల్లగా ఉండదు!
  • ఈ మిశ్రమం చిక్కగా అయిన తర్వాత.. ఇందులో ఆవాలపేస్టు వేసి ఉడికించాలి.
  • ఇప్పుడు చల్లారిన అన్నాన్ని ఇందులో వేసి మళ్లీ రెండో తాలింపు వేయాలి.
  • రెండో తాలింపు కోసం.. కడాయిలో ఆయిల్‌ పోసి వేడిచేసి ఆవాలు వేసి అవి చిటపటలాడాక వేరుసెనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి.
  • ఇలా చేస్తే.. పులిహోర రుచి అచ్చం గుడిలో చేసినట్టుగానే ఉంటుంది! మరి.. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా తయారు చేసుకోండి!

పిల్లలు రోజూ వైట్​ రైస్​ ఎలా తింటారు మమ్మీ? - ఈ కలర్​ ఫుల్​ 'గార్లిక్ రైస్' పెట్టండి - మెతుకు మిగలదు!

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

ABOUT THE AUTHOR

...view details