NEET Exam Reforms :ఎన్‌టీఏ 2025 పరీక్షల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఎన్‌టీఏ 2025 నుంచి ఉన్నత విద్యా సంస్థలకు ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించదని ఆయన స్పష్టం చేశారు.
నీట్ ఎగ్జామ్
వచ్చే ఏడాది నుంచి నీట్-యూజీ పరీక్షను పెన్-పేపర్ విధానంలో నిర్వహించాలా లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలా అనే అంశంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భవిష్యత్‌లో కంప్యూటర్ అడాప్టివ్ టెస్ట్, టెక్ ఆధారిత ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా 2025లో పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కొత్తగా 10 పోస్టులు సృష్టిస్తామని తెలిపారు.