Khel Ratna Award 2025 : ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. దిల్లీ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో అవార్డు గ్రహీతలైన అథ్లెట్స్ పాల్గొని సందడి చేశారు. హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, చెస్ విభాగంలో డి.గుకేశ్, షూటింగ్ విభాగంలో మను బాకర్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్ ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ జివాంజీ దీప్తి, జ్యోతి యర్రాజీ కూడా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు.
ఇక వీరితో పాటు మరో 32 మంది అర్జున, ఐదుగురు అథ్లెట్లు ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో బ్యాడ్మింటన్ స్టార్ మురళీధరన్, ఫుట్‌బాల్ ప్లేయర్ అర్మాండో ఆగ్నెలో కొలాకో రాష్ట్రపతి చేతుల మీద ఈ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.
#WATCH | President Droupadi Murmu presents National Sports and Adventure Awards 2024 at Rashtrapati Bhavan
— ANI (@ANI) January 17, 2025
(Source: President of India's Twitter handle) pic.twitter.com/3N9hxJ7p43
President #DroupadiMurmu presents the prestigious Major Dhyan Chand Khel Ratna Award to shooter @realmanubhaker at the National Sports Awards 2024. #Shooting #NationalSportsAwards @Media_SAI @IndiaSports pic.twitter.com/OruucHTX3p
— DD News (@DDNewslive) January 17, 2025
President Droupadi Murmu confers Arjuna Award, 2024 on Ms. Jeevanji Deepthi in recognition of her outstanding achievements in Para-Athletics. Her achievements are:
— President of India (@rashtrapatibhvn) January 17, 2025
• Bronze medal in Paralympic Games (Women’s 400m T20) held in Paris, France in 2024.
• Bronze medal in… pic.twitter.com/kcVhIfk4SL
అర్జున అవార్డు అందుకున్న అథ్లెట్స్ :
అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతూ (బాక్సింగ్), స్వీటీ బురా (బాక్సింగ్), సలీమా(హాకీ), వంతిక అగర్వాల్(చెస్), అభిషేక్ (హాకీ), అభయ్ సింగ్(స్క్వాష్), సంజయ్(హాకీ), హర్మన్‌ప్రీత్ సింగ్(హాకీ), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), స్వప్నిల్ సురేశ్ కుసాలే(షూటింగ్), సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్), సుఖ్‌జీత్ సింగ్(హాకీ), అమన్ (రెజ్లింగ్).
President #DroupadiMurmu presents Major Dhyan Chand Khel Ratna Award to Men’s Hockey Team Captain Harmanpreet Singh at the National Sports Awards 2024. #Hockey #NationalSportsAwards @Media_SAI@IndiaSports @13harmanpreet pic.twitter.com/bhA1q5mdvw
— DD News (@DDNewslive) January 17, 2025
అర్జున అవార్డు అందుకున్న పారా అథ్లెట్స్ :
రాకేశ్ కుమార్(పారా ఆర్చర్), సిమ్రాన్(పారా అథ్లెటిక్స్), మనీశా రాందాస్(పారా బ్యాడ్మింటన్), ప్రీతి పాల్(పారా అథ్లెటిక్స్), హెచ్. హోకాటో(పారా అథ్లెటిక్స్), అజీత్‌సింగ్(పారా అథ్లెటిక్స్), సచిన్ సర్జేరావు ఖిలారి(పారా అథ్లెటిక్స్), ప్రణవ్(పారా అథ్లెటిక్స్), నిత్యశ్రీ సుమతి శివన్(పారా బ్యాడ్మింటన్), నవ్‌దీప్(పారా అథ్లెటిక్స్), నితీశ్ కుమార్(పారా బ్యాడ్మింటన్), తులసీమతి మురుగేశన్(పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్(పారా జూడో), మోనా అగర్వాల్(పారా షూటింగ్), రుబినా ఫ్రాన్సిస్(పారా షూటింగ్).
President Droupadi Murmu confers Arjuna Award, 2024 on Shri Rakesh Kumar in recognition of his outstanding achievements in Para-Archery. His achievements are:
— President of India (@rashtrapatibhvn) January 17, 2025
• Bronze medal in Paralympic Games (Mixed Compound Team) held in Paris, France in 2024.
• One gold medal and… pic.twitter.com/t6ysywt8Hn
ద్రోణాచార్య అవార్డులు (కోచ్‌లు)
సుభాశ్ రాణా (పారా షూటింగ్), సందీప్ సంగ్వాన్ (హాకీ), దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్).
అర్జున అవార్డ్స్ (లైఫ్‌టైమ్)
మురళీకాంత్ రాజారాం పెట్కర్ (పారా స్విమ్మింగ్), సుచా సింగ్ (అథ్లెటిక్స్).
ఇదిలా ఉండగా, గతేడాది షమీతో పాటు చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలీ, పిస్టల్ షూటింగ్ సెన్సేషన్ ఈషా సింగ్, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, బాక్సర్ మహమ్ముద్ హుస్సాముద్దీన్, పారా ఆర్చర్ సీతల్ దేవీ అర్జున అవార్డు అందుకున్నారు. చెస్ క్రీడాకారుడు ప్రజ్ఞానందా కోచ్ ఆర్బీ రమేశ్ ద్రోణాచార్య పురస్కారాన్ని అందుకున్నారు.
'ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది, అయినా అవి నా లక్ష్యాలు కావు'- ఖేల్‌రత్న కాంట్రవర్సీపై మనూ
మను బాకర్, గుకేశ్‌కు ఖేల్‌రత్న- మరో ఇద్దరు ఒలింపిక్ విన్నర్స్‌కు కూడా