ETV Bharat / state

కొత్త రేషన్ కార్డుల జారీ డేట్ ఫిక్స్ - సభ్యుల వివరాలు చేర్చేదానిపై ఆరోజే స్పష్టత - NEW RATION CARDS ISSUE IN JANUARY

వేగం పుంజుకున్న కొత్త రేషన్​ కార్డుల జారీ ప్రక్రియ - ఈ నెల 24 వరకు అర్హుల ఎంపిక పూర్తి - 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ

New Ration Cards Update in Telangana
New Ration Cards Update in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2025, 11:19 AM IST

Updated : Jan 17, 2025, 11:37 AM IST

New Ration Cards Update in Telangana : హైదరాబాద్​లో కొత్త రేషన్​ కార్డుల జారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. అర్హులను గుర్తించేందుకు బల్దియా కమిషనర్​ ఇలంబర్తి ఆధ్వర్యంలో గురువారం అధికారులు రంగంలోకి దిగారు. 150 డివిజన్లలో దరఖాస్తుదారులను పరిశీలించారు. కాగా ఈ నెల 24 నాటికి అర్హుల ఎంపికను పూర్తి చేసి, 25న నివేదికను ఆయా జిల్లా కలెక్టర్లు ఇవ్వాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులను ప్రభుత్వం వద్దనున్న సమాచారంతో సరిచూసి, 26 నుంచి కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. గ్రేటర్​లో 22 లక్షల కుటుంబాల వివరాలను నమోదు చేయగా, అందులో రేషన్ కార్డు లేదని, కొత్త రేషన్ కార్డు కావాలనే అభ్యర్థనలు అందాయి. పరిశీలన అనంతరం 83,285గా లెక్క తేల్చింది. ఇటీవల ఇంటింటి సర్వేలోనూ అనేక మంది రేషన్​కార్డులు లేనివారు వివరాలు నమోదు చేయించుకున్నారు. కొన్నేళ్లుగా కొత్త కార్డులు ఇవ్వకపోవడం, జన్మించిన శిశువులు, కొత్తగా వచ్చిన కోడళ్ల పేర్లను రేషన్ ​కార్డుల్లో చేర్చాలంటూ వేలాది మంది అప్లై చేసుకున్నారు. వీటిని పరిగణలోకి తీసుకునే అంశంపై రెండు రోజుల్లో ఆదేశాలు రావొచ్చు.

కొత్త రేషన్​కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా? - వారంలో కీలక ప్రకటన

కొత్త రేషన్​కార్డుల దరఖాస్తుల డేట్ ఇదే! - అప్లై చేసేందుకు మళ్లీ ఊరెళ్లాల్సిందే

Last Updated : Jan 17, 2025, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.