Hari Hara Veera Mallu First Single : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. భారీ అంచనాలతో పాటు బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ రూపొందిస్తున్నారు. మార్చి 28న విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం ప్రమోషనల్ ఈవెంట్స్ శరవేగంగా జరగుతోన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ 'హరి హర వీరమల్లు' ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. 'మాట వినాలి' అంటూ సాగే ఆ పాటను పవన్ కల్యాణ్ స్వయంగా ఆలపించారు. కీరవాణి స్వరాలు అందించిన ఈ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
ఇక 'హరిహర వీరమల్లు' సినిమా విషయానికి వస్తే, హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, నోరా ఫతేహి, విక్రమ్‌జీత్, జిషుసేన్ గుప్త్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రెండు పార్టులుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగమైన 'హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' 2025 మార్చి 28న సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్ శక్తిమంతమైన యోధుడిగా కనువిందు చేయనున్నారు. రాబిన్ హుడ్ పాత్ర అని సినీ వర్గాల మాట. వాస్తవానికి గత కొద్ది కాలంగా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గానే మళ్లీ షూటింగ్ వేగం పుంజుకుంది.
'హరిహర వీరమల్లు' షూటింగ్ అప్డేట్ - ఫైనల్ షెడ్యూల్ కోసం పవన్ రెడీ