తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఔట్‌డోర్ కార్మికులపై భానుడి భగభగ​- ఏప్రిల్, జూన్​లో ఇంకా తీవ్రం- యజమానులు ఇవి పాటించాల్సిందే! - IMD Heat Wave Warning

Sun Heat Effects On Outdoor Workers : ఔట్‌డోర్ వర్కర్లకు ఎండల గండం పొంచి ఉంది. మే, జూన్‌ నెలల నాటికి భానుడి నిప్పుల వర్షం నడుమ పనులు చేయడం వీరికి పెద్ద సవాల్‌గా మారనుంది. వ్యవసాయ కూలీలు, నిర్మాణరంగ కార్మికులు, రోడ్లపై చిరువ్యాపారాలు చేసుకునే వారిపైనే ఎండల ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. వారు వడదెబ్బకు గురికాకుండా చర్యలు చేపట్టాల్సిన నైతిక బాధ్యత పని చేయించుకునే వారిపైనే ఉందని నిపుణులు చెబుతున్నారు. పని ప్రదేశాల్లో సరైనా వసతులు కల్పించాలని సూచిస్తున్నారు.

Sun Heat Effects On Outdoor Workers- Heat Wave Guidelines
Sun Heat Effects On Outdoor Workers- Heat Wave Guidelines

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 3:15 PM IST

Sun Heat Effects On Outdoor Workers : ఏప్రిల్‌లోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే 45 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత ఈసారి ఎక్కువగానే ఉంది. భానుడి భగభగల ప్రభావాన్ని ప్రధానంగా ఎదుర్కొనేది ఔట్ డోర్ వర్కర్లు. వ్యవసాయ కూలీలు, రోడ్లపై చిరువ్యాపారాలు చేసుకునేవారు, నిర్మాణ రంగ కార్మికులు, ఆరుబయట వర్క్స్ చేసే వారంతా ఈ జాబితాలోకి వస్తారు. ఎండకు ఎండుతూ వీరు ఎంతో శ్రమిస్తుంటారు. ఔట్ డోర్ వర్కర్లలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటారు. ఆఫీసులో కూర్చొని పనిచేసే వారికైనా ఆరుబయట చెమటోడ్చే వారికైనా ఆరోగ్యం విలువ ఒక్కటే. ఎండలు మండిపోతున్న ప్రస్తుత సీజన్‌లో ఔట్ డోర్ వర్కర్ల ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయా పనులు చేయించే వారిపై ఉంటుంది. కార్మిక చట్టాలు చెబుతున్నది కూడా ఇదే.

ఎండలకు వడగాలులు తోడైతే
ఏప్రిల్- జూన్ మధ్యకాలంలో టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎండలు అత్యంత దారుణమైన ప్రభావాన్ని చూపుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల వెల్లడించింది. దేశవ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఈసారి వడగాలులు వీచే ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. మండే ఎండలు, వడగాలుల వల్ల వాతావరణంలో తేమ మోతాదు పెరిగిపోతుందని దీనివల్ల శరీరం నుంచి రిలీజయ్యే చెమట మోతాదు పెరుగుతుందని ఐఎండీ పేర్కొంది. ఔట్ డోర్ వర్క్స్ చేసే వారు ఈ పరిస్థితుల వల్ల ప్రత్యక్షంగా ప్రభావితం అవుతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులతో ఔట్ డోర్ వర్క్స్ చేయించే వారు నైతిక బాధ్యతతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పనిగంటల తగ్గింపు, షిఫ్టులలో మార్పు
''సమ్మర్ సీజన్ ముగిసే వరకు ఎండ అధికంగా ఉండే మధ్యాహ్నం సమయంలో ఔట్ డోర్ వర్కర్స్‌కు పని గంటలను తగ్గించాలి. వీలైతే ఎండ తక్కువగా ఉన్న సమయానికి షిఫ్టులను మార్చాలి. కార్మికులు పనిచేసే చోట షామియానాలు ఏర్పాటు చేయించాలి. తాగునీటి వసతిని కల్పించాలి. అత్యవసర వైద్య కిట్‌ను కూడా అందుబాటులో ఉంచాలి'' అని కార్మిక రంగ పరిశీలకులు సూచిస్తున్నారు. పనిచేసే సమయంలో మధ్యలో తప్పనిసరిగా కార్మికులకు బ్రేక్ ఇవ్వాలని అంటున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వడగాలులు, ఎండను లెక్క చేయకుండా నిరంతరాయంగా కార్మికులు పనిచేస్తే వడదెబ్బ బారినపడే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈవిషయంలో కార్మికులకు కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా పనిని కేటాయించే వారిపైనే ఉంటుందని కార్మిక హక్కుల సంస్థలు గుర్తు చేస్తున్నాయి

అధ్యయన నివేదిక ఏం చెబుతోంది
'ఔట్​ వర్కర్లు - సమ్మర్ సీజన్' అనే అంశంపై అమెరికాకు చెందిన పాల్ జీ అలెన్ ఫ్యామిలీ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయన నివేదిక 2024 మార్చిలో 'వన్ ఎర్త్' జర్నల్‌లో పబ్లిష్ అయింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలు ఈసారి మండుటెండల ముప్పును ఎదుర్కోబోతున్నారు. ఈ ప్రాంతాలలో ఔట్ డోర్ వర్క్స్ చేసుకునే వారికి ఏప్రిల్ - జూన్ మధ్యకాలం అనేది పెనుసవాల్‌గా మారబోతోంది. వారందరి ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లకూడదంటే అక్కడి ప్రభుత్వాలు చొరవచూపి, రోజూ ఎండలు ఎక్కువగా ఉండే సమయంలో వారి పనిగంటలు తగ్గేలా చూడాలి.

ఔట్ వర్కర్లలో గర్భిణులు కూడా ఉంటారు. వారికి వడదెబ్బ తాకితే గర్భంలోని బిడ్డపై ప్రభావం పడే రిస్క్ ఉంది. ఇలాంటి మహిళలలో 6.1 శాతం మందిలో బిడ్డ కడుపులోనే చనిపోయే ముప్పు ఉందని అధ్యయన నివేదిక తెలిపింది. కొందరిలో 9 నెలల కంటే ముందే డెలివరీ జరిగే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది.

మోడ్రన్​ లైఫ్​స్టైల్​తో అనారోగ్య సమస్యలు- మార్చుకోకపోతే ఈ వ్యాధులు తప్పవు! - World Health Day 2024

అవుట్​డోర్ vs ట్రెడ్​మిల్​ - వాకింగ్ చేయడానికి ఈ రెండిట్లో ఏది మంచిది? - Outdoors Vs Treadmill for Walking

ABOUT THE AUTHOR

...view details