తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సమ్మర్​లో ఈ మిల్క్​షేక్​లు తాగితే - ఎండ వేడిమి నుంచి బిగ్ రిలీఫ్! - ప్రిపరేషన్​ వెరీ ఈజీ! - Summer Milkshake Recipes - SUMMER MILKSHAKE RECIPES

Summer Milkshake Recipes : వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడం కోసం చాలా మంది ఏవేవో శీతల పానీయాలు తాగుతుంటారు. వాటి వల్ల తక్షణ ఉపశమనం దొరికినా తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు! కాబట్టి, వాటికి బదులుగా ఇంట్లోనే ఈజీగా ఇలా.. క్యారెట్​, బనానా మిల్క్ షేక్​లను ప్రిపేర్ చేసుకోమని సలహా ఇస్తున్నారు.

Best Milkshake Recipes for Summer
Summer Milkshake Recipes (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 6:21 PM IST

Best Summer Milkshake Recipes :రోజురోజుకి ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మందికి వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చల్ల చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. దీంతో ఎక్కువగా లెమన్ వాటర్, కొబ్బరినీళ్లు, చెరుకురసం, మజ్జిగ వంటివి తాగుతూ ఉంటారు. ఇక మరికొందరైతే.. శీతల పానీయాలు సేవిస్తుంటారు. అలాకాకుండా ఇంట్లోనే ఈజీగా.. క్యారెట్, బనానా మిల్క్ షేక్​లను ప్రిపేర్ చేసుకొని తాగేయండి. అటు ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇటు ఎండ వేడిమి నుంచి బిగ్ రిలీఫ్ లభిస్తుంది! అంతేకాదు.. ఈ సమ్మర్ స్పెషల్ మిల్క్ షేక్​లను పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. పైగా వీటి తయారీకి ఉపయోగించే పదార్థాలలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ, ఈ సమ్మర్​ స్పెషల్ మిల్క్ షేక్(Milkshake)ల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

క్యారెట్ మిల్క్ షేక్ (Carrot Milkshake) :

కావాల్సిన పదార్థాలు :

  • పాలు - ఒక కప్పు
  • క్యారెట్ తరుగు - ముప్పావు కప్పు
  • బాదం - 6
  • యాలకుల పొడి - చిటికెడు
  • హార్లిక్స్ పొడి - ఒక స్పూను
  • షుగర్​ - రెండు స్పూన్లు

క్యారెట్ మిల్క్ షేక్ తయారీ విధానం :

  • ముందుగా బాదం పప్పులను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటి పొట్టుతీసి బాదం తరుగును ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే, క్యారెట్స్​ను శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కొని ఒక ముప్పావు కప్పు క్యారెట్ తరుగు రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద ఒక బౌల్ తీసుకొని అందులో పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి. అలా మరుగుతున్న టైమ్​లో ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బాదం, యాలకుల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అదే విధంగా షుగర్​ను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత దాన్ని గ్లాసులలోకి తీసుకొని పైన కాస్త యాలకుల పొడి, హార్లిక్స్ పొడితో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. నోరూరించే టేస్టీ టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ రెడీ!

బీట్​రూట్ మిల్క్​షేక్​ సేవించండి.. ఆరోగ్యంగా ఉండండి!

బనానా మిల్క్ షేక్(Banana Milk Shake) :

కావాల్సిన పదార్థాలు :

  • పాలు - ఒక కప్పు
  • జీడిపప్పులు - గుప్పెడు
  • పండిన అరటి పండ్లు - రెండు
  • చక్కెర - ఒక స్పూను
  • బాదం తరుగు - రెండు స్పూన్లు
  • హార్లిక్స్ - రెండు స్పూన్లు

బనానా మిల్క్ షేక్ తయారీ విధానం :

  • ముందుగా ఒక కప్పు పాలను కాచి చల్లార్చి ఫ్రిజ్​లో పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత బనానాలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఫ్రిజ్​లో పెట్టిన పాలు, కట్ చేసుకున్న అరటిపండు ముక్కలు, బాదం, జీడిపప్పులు, పంచదార అన్నింటినీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని గ్లాసులలోకి తీసుకొని పైన హార్లిక్స్ పొడి, కొన్ని బాదం, జీడి పలుకులను తరిగి గార్నిష్ చేసుకోండి.
  • అంతే.. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని బనానా మిల్క్ షేక్ రెడీ!

గుబాళించే గులాబీ పూలతో.. 'గుల్​కండ్​ మిల్క్​షేక్'.. సింపుల్​ రెసిపీ మీ కోసం..​

ABOUT THE AUTHOR

...view details