తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నచ్చిన దుస్తులను ధరించే స్వేచ్ఛ ఉండాలి'- హిజాబ్​పై సుప్రీం కీలక వ్యాఖ్యలు - SC On Hijab Banning

SC On Hijab Banning : కాలేజీల్లో హిజాబ్, బుర్ఖా, క్యాప్, నిఖాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నచ్చిన దుస్తులను ధరించే హక్కు విద్యార్థినిలకు ఉండాలని పేర్కొంది. క్యాంపస్​లో హిజాబ్, బుర్ఖా, క్యాప్, నిఖాబ్​ను నిషేధిస్తూ ముంబయిలోని ఓ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్​పై స్టే విధించింది సుప్రీంకోర్టు.

SC On Hijab Banning
SC On Hijab Banning (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 3:48 PM IST

Updated : Aug 9, 2024, 4:20 PM IST

SC On Hijab Banning :క్యాంపస్​లో హిజాబ్, బుర్ఖా, క్యాప్, నిఖాబ్​ను నిషేధిస్తూ ముంబయిలోని ఓ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్​పై సుప్రీంకోర్టు స్టే విధించింది. నచ్చిన దుస్తుల ధరించే స్వేచ్ఛ విద్యార్థినిలకు ఉండాలని అభిప్రాయపడింది. విద్యా సంస్థలు, విద్యార్థినిల డ్రెస్ కోడ్​పై బలవంతం చేయలేవని పేర్కొంది. ఈ మేరకు ఎన్​జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కళాశాలను నిర్వహిస్తున్న చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి నోటీసులను జారీ చేసింది. నవంబర్ 18 లోపు విద్యార్థినిల డ్రెస్ కోడ్​పై విధించిన నిషేధంపై ప్రతిస్పందనను తెలియజేయాలని కోరింది.

"నచ్చిన దుస్తులను ధరించే అవకాశం విద్యార్థినిలకు ఉండాలి. డ్రెస్ కోడ్​పై వారిని కాలేజీలు బలవంతం చేయకూడదు. దేశంలో అనేక మతాలు ఉన్నాయని తెలిసి, మీరు అకస్మాత్తుగా ఇలాంటి చర్యలు తీసుకోవడం దురదృష్టకరం. విద్యార్థుల పేర్లు వారి మతపరమైన గుర్తింపును బయటపెట్టట్లేదా? అలాగని ఇక నుంచి వారిని నంబర్లతో పిలుస్తారా?. విద్యార్థుల మత విశ్వాసాలను బహిర్గతం చేయకూడదనే ఉద్దేశ్యంతో కళాశాల తిలక్(బొట్టు), బిందీలను ఎందుకు నిషేధించలేదు" అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్​తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

'క్లాస్ రూమ్​లో బుర్ఖా ధరించరాదు'
క్లాస్ రూమ్​లో అమ్మాయిలు బుర్ఖా ధరించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. క్యాంపస్​లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలకు అనుమతి లేదని పేర్కొంది. ఈ మధ్యంతర ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు విద్యా సంస్థ కోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పించింది. అనంతరం దీనిపై కాలేజీకి నోటీసులు జారీ చేసింది. నవంబరు 18లోగా తమ స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదీ కేసు
క్యాంపస్​లో హిజాబ్‌, బుర్ఖా, నిఖాబ్‌, క్యాప్‌ వంటివి ధరించకూడదంటూ ముంబయిలోని ఎన్​జీ ఆచార్య అండ్‌ డీకే మరాఠీ కాలేజీ ఇటీవల ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. కళాళాల జారీ చేసిన సర్క్యులర్​ను బాంబే హైకోర్టు సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హిజాబ్, బుర్ఖా నిషేధం కారణంగా విద్యార్థినిలకు తరగతులకు హాజరుకాలేకపోతున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కాలేజీ జారీ చేసిన సర్క్యులర్​పై స్టే విధించింది.

హిజాబ్​పై ఇరాన్​ మహిళ స్వేచ్ఛానినాదం.. ఇంకా చల్లారని ఆగ్రహ జ్వాల!

హిజాబ్​ నిషేధంపై ఎటూ తేల్చని సుప్రీం.. భిన్న తీర్పులిచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు

Last Updated : Aug 9, 2024, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details